BigTV English

Anjaneya : ఆంజనేయుడు మానవాళికి నేర్పిన మంచి విషయాలు

Anjaneya : ఆంజనేయుడు మానవాళికి నేర్పిన మంచి విషయాలు
Anjaneya

Anjaneya : దేన్ని పట్టుకోవాలంటే..
జీవితంలో ఏదైనా సాధించాలనుకున్నప్పుడు దేన్ని పట్టుకోవాలో ….దేన్ని విడిచిపెట్టలో తెలియాలి. సరైన మార్గాన్ని తెలుసుకోవాలి.తెలియడం కాదు…పాటించే దమ్ము కూడా ఉండాలి. ధర్మం తెలిసిన బ్రాహ్మణుడు రావణుడు.అపారమైన శివ భక్తుడు.అయినా పరస్త్రీలపై ఆశ…పరుల సొమ్ము నందు వాంఛను చంపుకోలేకపోయాడు.చివరకు రాముని ఒక్క బాణంతో పది తలలు కూలి మట్టిలో కలిసిపోయాడు. ధర్మ మూర్తి అయిన శ్రీ రాముని పాదాలను పట్టి ఆశ్రయించి….ఆయన బాట యందు నడిచిన స్వామి హనుమ చిరంజీవి గా మిగిలిపోయారు. చరిత్రలో నిలిచిపోయారు.


నిజమైన మిత్రుడ్ని వదులుకోకు
జీవితంలో కష్టాల సుఖాలు రెండూ పంచుకునే మంచి మిత్రులు దొరకడం చాలా కష్టం. నిజంగా అలాంటి వాళ్ళు దొరికినప్పుడు…వాళ్ళని ఎన్ని కష్టాలొచ్చినా విడిచిపెట్టకూడదు. వంచనతో..బలంతో..భార్యను,భూమిని, బలగాన్ని తనవైపు తిప్పుకున్న వాలికి మంత్రిగా హనుమ ఒక్క నాటికి లేరు. తన దారి తానూ చూసుకోలేదు.న్యాయం వైపుగా..సుగ్రీవుడి పక్షాన్నే నిలిచి…ఉన్నారు.

నాదేం లేదని చెప్పాలా…
లంకను చూసి రమ్మన్న రాముడి ఆదేశాల ప్రకారం అక్కడకి వెళ్లిన హనుమంతుడు శక్తి ఏంటో రావణాసురుడికి బాగా తెసింది. తన తోకకి పెట్టిన నిప్పుతో లంకా దహనం చేసి రావణరాజ్యాన్ని కకావికలం చేశాడు. తాను తలచుకుంటే శరీరాన్ని అమాంతం పెంచి వంగి ఒక్క చేత్తో అవతలి లంకా తీరాన్ని అందుకో గలను…అంత బలం ఉంది కానీ ఎలా వెళ్లాతో తెలుసా అని మాటల్లో చెప్పి చూపించాడు. రామబాణంలా దూసుకుపోయాడు. ఇంత చేసినా వల్ల ,నా బలం..ఇదంతా నేనె చేసాను.. అని హనుమ ఒక్క సారి కూడా అనలేదు!


పెద్దరికాన్ని గౌరవించు
రావణుడు హనుమను బంధించి తీసుకు రమ్మన్నపుడు ఎన్నో విధాలుగా ప్రయత్నించి చివరగా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తారు. నిజానికి బ్రహ్మాస్త్రం హనుమను ఆపలేదు. హనుమ బ్రహ్మాస్త్రాన్ని గౌరవించి కట్టుబడతాడు. రావణ సభలో అంతే సులువు గా ఆ తాళ్లను విడిపించుకున్నారు.

గమ్యాన్ని మరిచిపోకూడదు
చేసే పనిలో ….గమ్యాన్ని చేరుకోడం లో..ఎలాంటి అడ్డంకులున్నా ప్రయాణం ఆపకూడదని హనుమ చేసుకున్న ప్రమాణం. మోసం చేసేవాళ్ళు ఉంటారు. మోసపోకు…ఆగిపోకు..ముందుకు మరో అడుగేసి సాగిపోవాలని సందేశాన్ని ఇచ్చాడు హనుమంతుడు. హనుమ సముద్రం దాటుతూ ఉండగా….ఒక అందమైన బంగారు పర్వతం…పైకి లేచింది! స్వామి…మీరు చాలా దూరం ప్రయాణం చేసిఅలసి ఉన్నట్టు కనబడుతున్నారు..! కాసేపు నా ఈ పర్వతం పై కూర్చుని….విస్రాంతి తీసుకుని,ఇక్కడ ఉన్న పళ్ళు కాయలు తిని వెళ్ళండని ఆహ్వానిస్తుంది. సముద్రం లో బంగారు పర్వతమా? మాయలా ఉంది? అని హనుమంతుడికి అనిపిస్తుంది.ఆలోచించి…ఆ పర్వతాన్ని చేత్తో ప్రేమగా తాకి,లంకా నగరం వైపుగా వెళ్ళిపోయారు.

ఇలాంటివి ఎన్నో హనుమంతుడ్ని మనిషి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. హనుమ కథ లో…వెతుక్కుంటూ పొతే మన జీవితానికి కావలిసిన పాఠాలు లెక్కలేనన్ని ఉన్నాయి.

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×