Big Stories

Akshaya Tritiya:- అక్షయ తృతీయరోజు ఇవి దానం చేస్తే రాజయోగమే

Akshaya Tritiya:- అక్షయమైన సౌభాగ్యాన్ని, విజయాలను, దైవకటాక్షాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి వైశాఖ శుద్ధ తదియను అక్షయతృతీయగా పరిగణిస్తారు. క్షీరసాగరమథనం తర్వాత లక్ష్మీదేవి మహావిష్ణువును వరించిన రోజు కూడా ఇదే. అక్షయతృతీయ రోజునే విశాఖపట్నంలోని సుప్రసిద్ధ దేవాలయంసింహాచలం శ్రీలక్ష్మీనరసింహస్వామి నిజరూపదర్శనం జరుగుతుంది.

- Advertisement -

అక్షయ తృతీయ రోజున కందిపప్పు, బియ్యం వంటి ధాన్యాలు కొనడం మంచిదని పండితులు చెబుతున్నారు. బంగారం, వెండితో పాటు ఎరుపురంగు చీర లేదా ఎరుపురంగు వస్తువులు అనాధలకు, వృద్ధులకు, పేద రైతులకు ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అక్షయ తృతీయ తెల్లవారుజామున ఆవుకి పూజ చేస్తే విశేషంమైన ఫలితం ఉంటుంది. గోమాతకు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున పసుపు, కుంకుమలు ఇతరులకు ఇవ్వడం మంచిదని పండితులు సలహా ఇస్తున్నారు.

- Advertisement -

అన్నదానం చేయడం ద్వారా దేవతలకే అన్నం పెట్టిన ఫలితం దక్కుతుంది. అక్షయ తృతీయనాడు పండ్లు, ఫలాలు దానం చేస్తే దైవానుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఉన్నత పదవులు లభించి జీవితంలో మరో మెట్టు ఎదుగుతారు. చెప్పులు, విసనకర్ర, గొడుగులు దానం చేస్తే సుఖమయ జీవితం లభిస్తుంది. ఈ రోజున పేదలకు కావాల్సిన వస్తువులను దానం చేస్తే రాజయోగం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వస్త్రాలు దానం చేస్తే ఆరోగ్యం చేకూరుతుంది. రోగాలు దరిచేరవు. మజ్జిగ లేదా నీటిని దానం చేస్తే విద్య ప్రాప్తిస్తుంది. పెరుగుదానం చేస్తే పాప విమోచనం లభిస్తుంది.ఆహార ధాన్యాలు దానం చేస్తే ప్రమాదాలు, అకాలమరణాలు వంటివి దూరమవుతాయి. గోమాతలో దేవతలందరూ ఉంటారు కాబట్టి అరటిపండు ఇవ్వడం మంచిది. అక్షయ తృతీయ నాడు సంబా గోధుమను బాగా ఉడికించి లక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించడం మంచి ఫలితాలిస్తుంది. కుబేరలక్ష్మి, లక్ష్మీ నారాయణన్, లక్ష్మీ నరసింహ పటాల ముందు నైవేద్యంగా సమర్పించవచ్చు. అలాగే గోధుమతో చేసే స్వీట్లు నైవేద్యంగా సమర్పించవచ్చును.

అలాగే నీటితో నిండిన మట్టి కుండలను దానం చేయడం వల్ల ఎన్నో తీర్థయాత్రలను దర్శనం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అందుకే అక్షయ తృతీయ రోజున చాలా మంది జలదానం చేస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News