BigTV English
Advertisement

R.K.Roja గుర్తుపట్టలేని స్థితిలో సినీనటి రోజా .. ఇలా మారిపోయిందేంటీ?

R.K.Roja గుర్తుపట్టలేని స్థితిలో సినీనటి రోజా .. ఇలా మారిపోయిందేంటీ?

R.K.Roja: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో సీనియర్ నటి రోజా(Roja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన రోజా అనంతరం తన సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా తల్లి పాత్రలలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈమె రాజకీయాలలో (Politics)కి వచ్చిన తరువాత వెండితెరకు పూర్తిగా దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయ కార్యకలాపాలలో రోజా బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ఉండేవారు.


12 సంవత్సరాల తరువాత రీ ఎంట్రీ..

రోజా మంత్రిగా బాధ్యతలు ఎప్పుడైతే తీసుకున్నారో బుల్లితెర కార్యక్రమాల నుంచి కూడా తప్పకున్న సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికలలో ఈమె ఓటమిపాలు కావడంతో తిరిగి బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇలా బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చిన రోజా వెండితెర సినిమాలలో కూడా నటిస్తుందని అందరూ భావించారు. అనుకున్న విధంగానే ఈమె 12 సంవత్సరాల తర్వాత తిరిగి సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈమె తెలుగు సినిమాలలో కాకుండా తమిళ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తమిళంలో బాలచంద్రన్ (Balachandran)దర్శకత్వంలో తెరకెక్కుతున్న “లెనిన్ పాండియన్” (Lenin Pandiyan)సినిమాలో “సంతానం” అనే పాత్రలో రోజా నటించబోతున్నట్టు తెలుస్తోంది.

డీ గ్లామర్ లుక్ లో రోజా..

తాజాగా ఈమె పాత్రను పరిచయం చేస్తూ మూవీ టీం ఒక వీడియోని రిలీజ్ చేశారు.. ఈ వీడియోని విడుదల చేసిన చిత్ర బృందం 90s క్వీన్ ను మళ్లీ సిల్వర్ స్క్రీన్ కు తీసుకురావడం పట్ల ఎంతో గౌరవంగా భావిస్తున్నాం అంటూ నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిలిమ్స్ ఈ వీడియోని విడుదల చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రోజా లుక్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.. డీ గ్లామర్ పాత్రలో రోజా కనిపించడంతో గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. ఇక ఈ సినిమా ద్వారా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన రోజా మంచి సక్సెస్ అందకోవాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


ఇలా తమిళ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చిన రోజా తెలుగు సినిమాలలోకి కూడా రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు. మరి తెలుగు సినిమాలను చేయడానికి రోజా సిద్ధంగా ఉన్నారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక లెనిన్ పాండియన్ సినిమా విషయానికి వస్తే.. బాలచంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ మనవడు దర్శన్ గణేషన్(Darshan Ganeshan) హీరోగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాలో గంగై అమరన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు విడుదల చేసిన వీడియో చూస్తుంటే ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Also Read: Fauzi: ఫౌజీ కోసం తెగ కష్టపడుతున్న ఘట్టమనేని వారసుడు..  పెద్ద టాస్కే ఇదీ! 

Related News

Pawan Kalyan: స్టైలిష్ పొలిటీషియన్, ఉస్తాద్ భగత్ సింగ్ కోసమే ఈ లుక్స్?

Nagarjuna: తెలంగాణ డిప్యూటీ సీఎంతో నాగార్జున భేటీ…అదే కారణమా?

Bigg Boss 9 Promo : నేను మీ పనోన్ని కాదు, రెచ్చిపోయిన గౌరవ్ గుప్తా, ఇదయ్య మీ అసలు రూపం

Bandla Ganesh: మళ్లీ సారీ చెప్పిన బండ్లన్న… అనాల్సినవి అన్ని అనేసి… ఇప్పుడు క్షమాపణలా?

Fauzi: ఫౌజీ కోసం తెగ కష్టపడుతున్న ఘట్టమనేని వారసుడు..  పెద్ద టాస్కే ఇదీ!

Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?

Sree vishnu: సితార ఎంటర్టైన్మెంట్ లో శ్రీ విష్ణు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా విష్ణు కొత్త సినిమా!

Big Stories

×