Hyderabad: హైదరాబాద్‌లో జరిగిన మరో హత్యా యత్నానికి సంబంధించిన ఘటన కలకలం రేపుతోంది. తాజాగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని జగద్గిరిగుట్ట బస్ స్టాండ్ లో ఓ యువకుడి పై హత్య యత్నం చోటు చేసుకుంది. కత్తితో యువకుడిపై బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్, మరో దుండగుడు దాడి చేసినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్య యత్నానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
‘‘నన్ను చంపొద్దు కాలు పట్టుకుంటా.. వదిలేయండి’’ అని బాధితుడు ప్రాధేయపడుతన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. తీవ్ర గాయాల పాలైన యువకుడు రోషన్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. స్థానికులు ఈ వీడియో తీయడంతో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నడిరోడ్డుపై యువకుడిపై హత్యాయత్నం
కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. బాల్ రెడ్డి అనే రౌడీ షీటర్, మరో వ్యక్తి కలిసి రోషన్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడికి ఆర్థిక లావాదేవీలు కారణమని అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలైన రోషన్ పరిస్థితి… pic.twitter.com/ejJhz1F10f
— ChotaNews App (@ChotaNewsApp) November 5, 2025
భాదితుడు రోషన్(26) సైతం బాలనగర్ పియస్‌లో రౌడీషీటరే అని పోలీసులు తెలిపారు. హత్యయత్నం చేసిన వ్యక్తి బాలేశ్వర్ రెడ్డి(23)పై జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్లో రౌడీషీట్ నమోదైందని పేర్కొన్నారు. బాలేశ్వర్ ఫ్రెండ్ మహమ్మద్ తో కలిసి హత్యయత్నానికి పాల్పడ్డాడని, వీరు ముగ్గురు గంజాయి బ్యాచ్ అని పోలీసులు వెల్లడించారు. వీరిమధ్య ఆర్థిక లావాదేవిలవల్లే ఈ హత్యాయత్నానికి దారి తీసినట్టు పోలీసులు చెబుతున్నారు. కేసు దర్యాప్తులో మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడ్డ రోషన్ ని జగద్గిరిగుట్ట లాస్ట్ బస్టాప్ లో గల మెడిసిటీ హాస్పిటల్ కు తరలించి పరిస్థితి విషమించడంతో గాంధీ హాస్పిటల్ కు తరలించినట్టు తెలిపారు.