Car Accident: తెలుగు రాష్ట్రాలను వరుస రోడ్డు ప్రమాదాలు కుదిపేస్తున్నాయి. నిన్నటి ఘటన మరవకముందే ఈ రోజు అదే రూట్‌లో మరో యాక్సిడెంట్ జరిగింది. చేవెళ్ల – హైదరాబాద్ జాతీయ రహదారిపై.. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపుగా వెళ్తుంది కారు. మెుయినాబాద్ మండల పరిధిలోని తాజ్ సర్కిల్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండటంతో.. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి పక్కనే ఉన్న మర్రి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ఐదుగురు ఉండగా… నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తపుమడుగులో ఉన్న బాధితులను సమీపంలోకి హాస్పిటల్ కి తరలించారు. ఆపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.