Fauzi: సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగడం సర్వసాధారణం. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల పిల్లలు ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కొందరు హీరోలుగా కొనసాగుతుండగా మరి కొంతమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తూ మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే త్వరలోనే ఘట్టమనేని కుటుంబం నుంచి మరొక వారసుడు ఇండస్ట్రీలోకి రాబోతున్నారని తెలుస్తోంది. ఘట్టమనేని కుటుంబం నుంచి పలువురు హీరోలుగా కొనసాగుతున్నారు. ఇలా హీరోగా కొనసాగుతున్న వారిలో సుధీర్ బాబు (Sudheer Babu)ఒకరు. ప్రస్తుతం ఈయన జటా ధర(Jatadhara) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.
సుధీర్ బాబుకు ఇద్దరు కుమారులు అనే విషయం మనకు తెలిసిందే. పెద్ద కుమారుడు చరిత్ ఇప్పటికే పలు సినిమాలలో బాల నటుడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. త్వరలోనే ఈయన హీరోగా ఇండస్ట్రీలోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తాజాగా సుధీర్ బాబు తెలిపారు. మరొక రెండు సంవత్సరాలలో తన డెబ్యూ సినిమా రాబోతోందని క్లారిటీ ఇచ్చారు. అలాగే తన చిన్న కుమారుడు దర్శన్(Darshan) గురించి కూడా తెలిపారు. దర్శన్ కూడా త్వరలోనే ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ఫౌజీ(Fauzi) సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో కనిపించబోతున్నారని వెల్లడించారు.
ఇలా ప్రభాస్ సినిమాలో బాల నటుడిగా చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో దర్శన్ ట్రెండింగ్ లో ఉన్నారు. ఇక ఈ సినిమా కోసం దర్శన్ ఆడిషన్ కి వెళ్ళారని ఆడిషన్ ద్వారా సెలెక్ట్ అయ్యారని సుధీర్ బాబు తెలిపారు. ఇక ఈ సినిమా కోసం హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శన్ కు వేదాలు నేర్చుకోమని చెప్పినట్టు సుధీర్ బాబు వెల్లడించారు. ఇలా వేదాల నేర్చుకోవడం కోసం దర్శన్ చాలా కష్టపడ్డారని, ఎంతో సునాయసంగా పది నిమిషాలలోనే వేదాలు, మంత్రాలు మొత్తం చెప్పేస్తారని తెలిపారు.
ప్రభాస్ కి జోడిగా ఇద్దరు ముద్దుగుమ్మలు..
ఫౌజీ సినిమా కోసం హను దర్శన్ కు పెద్ద టాస్క్ ఇచ్చారని తెలుస్తోంది. దర్శన్ బాల నటుడిగా ఫౌజీ మొదటి సినిమా కావటం విశేషం.. ఇలా మొదటి సినిమాలోనే చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో కనిపించబోతున్న నేపథ్యంలో ఘట్టమనేని అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫౌజీ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. దాదాపు 60 శాతం షూటింగ్ పనులు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఈ సినిమాని 2026 ఆగస్టులో విడుదల చేసే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం .అందుకు అనుగుణంగానే షూటింగ్ కూడా వేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో ఇమాన్వీ(Imanvi) హీరోయిన్ నటించగా, కన్నడ ముద్దుగుమ్మ చైత్ర జె ఆచార్(Chaitra J Achar) నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్ విడుదల చేశారు.
Also Read: Big tv Kissik Talks: రాజు జీవితంలో రాణి లేదు.. బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన రాజు!