BigTV English

Rudrabhishekam : హస్త వాసి అనే మాటకి రుద్రాభిషేకానికి సంబంధమేంటి…….

Rudrabhishekam : హస్త వాసి అనే మాటకి రుద్రాభిషేకానికి సంబంధమేంటి…….
Rudrabhishekam

Rudrabhishekam : శివయ్యకి రుద్రాభిషేకం చేసేటప్పడు లింగముపైన మారేడు దళాలు ఉంచి ఒక్కొక్క కలశంలోని నీళ్ళతో కలశపూజ చేసి, ప్రతి కలశమునందు శివపంచాక్షరితో మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రించి, సిద్ధం చేసుకొని అప్పడు రుద్రాభిషేకము ప్రారంభించాలి. అభిషేకం పూర్తయ్యేసరికి కలశములలో అభిమంత్రించిన జలము సరిగ్గా సరిపోవునట్లు చేసుకోవాలి. అలా చేస్తేనే రుద్రాభిషేక ఫలితము పూర్తిగా కలుగుతుంది. చాలామంది శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో చెరువులో నుంచి లేదా నూతిలో నుంచి బిందెలతో తీసుకొచ్చి శివుడి పై వేస్తూ అభిషేకం చేస్తుంటారు. ఇలా చేసిన అభిషేకానికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు.ఇలా చెరువులలో తీసుకున్న నీటిలో విషపదార్థాలు ఉండటం చేత అలాంటి నీటితో అభిషేకం చేసిన ఫలితం శూన్యంగా ఉంటుంది. కనుక శివుడికి రుద్రాభిషేకం చేసేటప్పుడు కలశంలో ఉంచిన నీటితో మాత్రమే అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు.


చాలామంది బిందెలో నీళ్ళు నింపి ఆ నీటితో అభిషేకం చేస్తారు. దీనివల్ల ప్రయోజనము శూన్యము. ఈ విషయమే చాల మంది పురోహితులకు కూడా తెలియదు. కాబట్టి అభిషేక జలానికి గరుడ ముద్రను చేతితో నీటిపై చూపించి మృత్యుంజయ మంత్రముతో అభిమంత్రించి ఆ జలాన్ని అమ్రుతీకరణము చేయాలి. ఇది శాస్త్ర విహితమైనది. ఆవిధంగా రుద్రాభిషేకం చేసే వారి హస్తం అమ్రుతీకరణం అవుతుంది. ఆవిధంగా రుద్రాభిషేకం చేయువారి హస్తం అమ్రుతీకరణం అవుతుంది. ఆ వ్యక్తి ముట్టుకుంటే అమృతత్వం కలుగుతుంది.

అమ్రుతీకరణము చేయని జలముతో శివాభిషేకము ఫలితమివ్వదు. ఈ రహస్యము తెలిసి శివ పూజలు చేసిన అపమృత్యు బాధలను జయించవచ్చు. మఖ్యముగా నేటికాలంలోని వైద్యులు అందరూ ఈ విధమైన అభిషేకం చేయడం ద్వారా వారి హస్తము అమృతత్వం పొందుతుంది. వారిచ్చే మందులు లేదా ఔషధాలు పనిచేసి రోగులు శీఘ్రంగా ఆరోగ్యవంతులు అవుతారు. దీన్నే హస్త వాసి అని మన పెద్దలు అంటారు.


Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×