Samantha: ‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన సమంత (Samantha) ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి ఓవర్ నైట్ లోనే స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో ఉండే అందరి హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. కెరియర్ పీక్స్ లో ఉండగానే నాగచైతన్య (Naga Chaitanya)ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొంతకాలం ఇండస్ట్రీకి కూడా దూరమైంది.. ఇప్పుడిప్పుడే సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీగా మారిన ఈమె తాజాగా తాను నిజమైన ప్రేమను కనుగొనడంలో ఫెయిల్ అయ్యాను అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
విషయంలోకి వెళ్తే.. ఈ మధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈమె.. తాజాగా నిజమైన ప్రేమ గురించి ఒక సుదీర్ఘమైన పోస్టు పంచుకుంది. అందులో సమంత ఇలా రాసుకొచ్చింది. “తాజాగా నేను, నా మేకప్ ఆర్టిస్టు ఎన్నో విషయాల గురించి చర్చించుకున్నాము. అయితే ఆ చర్చ తర్వాత నేను ఆలోచనలో పడ్డాను. 30 ఏళ్ల తర్వాత మీరు కూడా చూసే ప్రపంచం తీరు మారుతుంది. ప్రతిదీ కూడా తగ్గుముఖం పడుతుంది. అందుకే జీవితాన్ని ఆస్వాదించాలి అంటే 20 సంవత్సరాల వయసులోనే ఆస్వాదించాలి. ఏదైనా చేయాలనుకుంటే అదే సరైన సమయం. 30 సంవత్సరాలు వచ్చాయి అంటే ఇక మీరేం చేయాలనుకున్నా కూడా చేయలేరు.
also read:OG collections: భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్… ఆ ఒక్క మిస్టేక్ వల్లే?
నిజమైన ప్రేమ గురించి ఎవరూ చెప్పలేదు..
ఈ వయసులో ఏం చేయాలన్నా సరే ప్రతి దానికి సమయం మించిపోయినట్లే అనిపిస్తుంది. నేను 20 లలో ఉన్నప్పుడు విశ్రాంతి లేకుండా గందరగోళంగా జీవితాన్ని గడిపాను. గుర్తింపు కోసం ఆరాటపడ్డాను. ఆ సమయంలో నన్ను నేను ఎంతో కోల్పోయాను. అయితే అప్పుడు నాకు ఎవరూ కూడా నిజమైన ప్రేమ గురించి చెప్పలేదు. అసలు నిజమైన ప్రేమ అంటే మనలోనే ఉంటుంది అది బయట నుంచి రాదనే విషయాన్ని ఆ సమయంలో నాకు ఎవరూ చెప్పలేదు. కాబట్టే నేను అలా ఉండిపోయాను. మనల్ని మనం ప్రేమించుకోవడమే నిజమైన ప్రేమ అని ఆ తర్వాత నాకు నేనే అర్థం చేసుకున్నాను” అంటూ సమంత చెప్పుకొచ్చింది.
పరుగులు తీయడం ఆపేసి, జీవితాన్ని ఆస్వాదించాలి..
అంతేకాదు జీవితం కోసం పరుగులు తీయడం ఆపేసి ప్రస్తుతం ఉన్న జీవితాన్ని ఆస్వాదించాలని ఆశిస్తున్నాను. గతంలో చేసిన తప్పుల తాలూక జ్ఞాపకాలను కూడా మోయడం మానేశాను. పబ్లిక్ లో ఒకలా.. ఒంటరిగా మరోలా రెండు రకాలుగా ఉండడం కూడా మానేశాను. ముఖ్యంగా మనం మనలా ఉన్నప్పుడే గర్వంగా, ధైర్యంగా, ఆనందంగా కూడా ఉంటాము. అప్పుడే స్వేచ్ఛగా జీవిస్తాము. నాలాగే ప్రతి అమ్మాయి కూడా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ సమంత చెప్పుకొచ్చింది. మొత్తానికైతే జీవితంలో గుర్తింపు పొందాలనే ఆలోచనలో భాగంగా తనను తాను మరిచిపోయి స్వేచ్ఛను కాదనుకొని నిజమైన ప్రేమను కనుగొనడంలో విఫలం అయ్యాను అంటూ తెలిపింది సమంత.
?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==