Mohsin Naqvi: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ జట్టుపై ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీమిండియా… 9వ సారి ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పటికే 8 సార్లు ఆసియా కప్ టోర్నమెంట్ గెలిచిన టీమిండియా.. నిన్న 9వ టైటిల్ కూడా అందుకుంది. అధికారికంగా టోర్నమెంట్ తీసుకోనప్పటికీ… ఛాంపియన్ అయితే టీమిండియానే. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్, ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అయిన నేపథ్యంలో…. ట్రోఫీని అతని చేతుల మీదుగా టీమిండియా అందుకోవాల్సిన పరిస్థితి నిన్న వచ్చింది. కానీ టీమిండియా మాత్రం ఈ విషయంలో… వెనకడుగు వేసింది. మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా అస్సలు ట్రోఫీ తీసుకోబోమని… సైడ్ అయిపోయింది. అయితే ఈ రన్నరప్ ట్రోఫీతో పాటు మెడల్స్.. మాత్రం పాకిస్తాన్ ప్లేయర్లకు మొహ్సిన్ నఖ్వీ అందించారు. కానీ టీమిండియాకు ఇవ్వాల్సిన ట్రోఫీని మాత్రం తనతో తీసుకురాలేదు. దీంతో… మొహ్సిన్ నఖ్వీనే ఆ ట్రోఫీని తీసుకుని పరార్ అయ్యాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా అయినప్పటికీ… ట్రోఫీని అందుకోలేదు. పాకిస్థాన్ కు చెందిన వ్యక్తి ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీ ఇస్తున్న తరుణంలో… టీమిండియా దాన్ని రిజెక్ట్ చేసింది. పాక్ వ్యక్తి ఇవ్వడం ఏంటని… ట్రోఫీ లేకుండానే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అయితే… దీనిపై బీసీసీఐ అధికారి సైకియా స్పందించారు. పాక్ వ్యక్తి ఇవ్వడం వల్లే ట్రోఫీని మేం తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. అలా అని… ట్రోఫీని వదులుకోవడం లేదని తెలిపారు. ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ దాచుకోకుండా… ఇండియాకు ఆ ట్రోఫీని పంపించాలని ఆదేశించారు. లేకపోతే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు సైకియా.
India refused to collect the Asia Cup from PCB Chairman Mohsin Naqvi, so he left the stadium with the trophy. What clownery is this? 🤯 pic.twitter.com/tLuvXMn29C
— Sameer Allana (@HitmanCricket) September 28, 2025