BigTV English

OG collections: భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్… ఆ ఒక్క మిస్టేక్ వల్లే?

OG collections: భారీగా పడిపోయిన ఓజీ కలెక్షన్స్… ఆ ఒక్క మిస్టేక్ వల్లే?

OG collections:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్ గా సెప్టెంబర్ 25వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన చిత్రం ఓజీ..ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi) ఇందులో విలన్ గా ఓమీ అనే పాత్రలో నటించి తన నటనతో అందరిని అబ్బురపరిచారు. అలాగే శ్రేయ రెడ్డి, అర్జున్ దాస్, శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్ లాంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమైంది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ సినిమా ప్రేక్షకుడిని ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పవచ్చు.


పడిపోతున్న ఓజీ కలెక్షన్స్..

సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం మొదటి రోజు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది.. ముఖ్యంగా ప్రీమియర్స్ తో కలిపి దాదాపు రూ.150 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చాయి. కానీ సినిమా విడుదలైన మొదటి రెండు రోజులు ఉన్న క్రేజ్.. ఇప్పుడు లేదనే చెప్పాలి. పైగా వీకెండ్స్ కూడా ఈ సినిమాకు కలిసి రాలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

నాలుగు రోజులకు గానూ ఎంత వసూలు చేసిందంటే.?


ముందుగా ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొదటిరోజు ప్రీమియర్స్ లో రూ.18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. సెప్టెంబర్ 25వ తేదీన ఏకంగా రూ.61 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. ఇక రెండవ రోజు రూ .20 కోట్లు, మూడవరోజు రూ. 19 కోట్లు, నాలుగవ రోజు కేవలం రూ.18 కోట్లు మాత్రమే రాబట్టింది. మొత్తంగా ఇండియాలో రూ.136 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా అటు ఓవర్సీస్ లో రూ. 23 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా చూసుకుంటే.. ఇప్పటివరకు కేవలం రూ.159 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసింది ఈ సినిమా.

కలెక్షన్స్ పై దెబ్బ కొట్టిన మిస్టేక్ అదే..

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విడుదలైన రెండవ చిత్రం.. పైగా ఈ సినిమాకు వీకెండ్స్ కూడా కలిసి రావడం అటు దసరా సెలవులు కూడా కావడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని.. బ్రేక్ ఈవెన్ వారాంతంలోపే సాధిస్తుందని అందరూ అనుకున్నారు
కానీ అవేవీ జరగలేదని చెప్పాలి. దీనికి కారణం.. స్టోరీ పెద్దగా లేకపోవడం.. ముఖ్యంగా నార్మల్ ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కలేదనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే ఈ సినిమాను ఓన్ చేసుకుంటున్నారు. సామాన్య ప్రేక్షకుడిని థియేటర్ కి రప్పించినప్పుడే కలెక్షన్స్ ఆటోమేటిక్గా పెరుగుతాయి కానీ ఈ సినిమా ఆడియన్స్ ప్రభావం పెద్దగా లేకపోవడం వల్ల ఇప్పుడు రోజు రోజుకి కలెక్షన్స్ పడిపోతున్నాయని చెప్పవచ్చు.

ALSO READ:Tollywood: హమ్మయ్య టాలీవుడ్ కి మంచి రోజులు.. త్వరలో కమిటీ నియామకం!

కక్ష గట్టిన వరుణుడు..

దీనికి తోడు వరుణుడు కూడా కక్ష కట్టినట్లు అనిపిస్తోంది. గురు శుక్రవారాలలో ఈ సినిమాకి కలెక్షన్స్ బాగానే వచ్చినా శుక్రవారం నుండే ఎడతెరపని వర్షాలు అటు థియేటర్లకు జనాలు రాకుండా అడ్డుకున్నాయనే చెప్పాలి. వీకెండ్స్ పైగా దసరా సెలవులను సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకున్న ఆడియన్స్ కి వర్షాలు పెద్ద ఎత్తున అడ్డంకి వేసాయి. అలా ముఖ్యంగా చెప్పుకునే హైదరాబాదులో వర్షాలు ఎక్కువగా రావడం వల్ల ఈ సినిమా షోలు దెబ్బతిన్నాయి. ఆదివారం కూడా వర్షాలు తగ్గుముఖం పట్టలేదు. సోమవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అంతేకాదు తెలంగాణలోని కొన్ని జిల్లాలకు మినహాయింపునిచ్చి రెడ్ అలెర్ట్ కూడా జారీ చేశారు. ఏది ఏమైనా ఇటు వర్షాలు అటు కథలో కంటెంట్ లేకపోవడం సినిమాకు భారీ దెబ్బ పడిందని చెప్పవచ్చు.

Related News

Samantha: నిజమైన ప్రేమ కోసం సమంత తాపత్రయం.. అంతా అయిపోయిందంటూ!

Tollywood: హమ్మయ్య టాలీవుడ్ కి మంచి రోజులు.. త్వరలో కమిటీ నియామకం!

Film Industry: ఇండస్ట్రీలో విషాదం…ఎన్టీఆర్ విలన్ భార్య కన్నుమూత!

The Raja saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి క్రేజీ అప్డేట్, ఒక్క ట్వీట్ తో రచ్చ లేపిన మారుతి

Kantara Chapter1 pre release: ఎన్టీఆర్ నాకు హీరో కాదు… బ్రదర్ రిషబ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్!

OG Film: ఓజి నిర్మాతలను రిక్వెస్ట్ చేస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ రాహుల్ యాదవ్

Kantara Chapter 1 Pre release: నొప్పితో బాధపడుతున్న ఎన్టీఆర్.. ఎక్కువ మాట్లాడలేనంటూ!

Big Stories

×