BigTV English

Thirunallar Saneeswara Temple : తిరునల్లార్ లో వెనక్కి తిరిగి చూడకూడదా….

Thirunallar Saneeswara Temple  : తిరునల్లార్ లో వెనక్కి తిరిగి చూడకూడదా….


Thirunallar Saneeswara Temple : హిందూమతంలో నవగ్రహాల పూజ విషయంలో చాలా ప్రత్యేకంగా చెప్పారు. ముఖ్యంగా శనీశ్వరుడి విషయంలో చాలమంది భయపడుతుంటారు. ఆ విగ్రహం దగ్గరకి రావడానికి కూడా కొంతమంది మనసులోనే ఆలోచిస్తుంటారు. కానీ దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా శనీశ్వరుడి బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కొన్ని రకాల బాధపడే వాళ్లు శని అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు. దేశవ్యాప్తంగా శనీశ్వరుడి ఆలయాలు చెప్పేకో దగ్గ స్థాయిలో ఉన్నాయి. అందులో ముఖ్యమైంది పాండిచ్చేరిలోని తిరునల్లార్ శనీశ్వరాలయం. దాదాపు మూడు వేల ఏళ్ల క్రితం ఈ ఆలయం నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.

శని పీడ ఉండని ప్రాంతం తిరునల్లార్ .ఇక్కడ స్వామి వారు దర్బారమేశ్వరుడుగా పూజలు అందుకుంటున్నారు. స్వామి వారిని దర్శించే భక్తులు చేతితో దర్బలను ముడి వేస్తూ ఉంటారు. ఇలా చేస్తే శనిదోషాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం. ఈ ఆలయానికి స్థానిక భక్తులే కాకుండా దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రత్యేకంగా శనివారం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. శనిశ్వీరుడ్ని దర్శించుకున్న తర్వాతే అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. దక్షిణభారతదేశంలో అతిశక్తవంతమైన ఆలయాల్లో ఇది ఒకటిగా చెబుతారు. నల మహారాజు ఇక్కడే శని విముక్తుడు అయ్యాడని స్థలపురాణం చెబుతోంది.


ఆలయానికి వచ్చే ముందు గుడి దగ్గర ఉన్న నలతీర్థంలో స్నానం చేయాల్సి ఉంటుంది. దర్భారణేశ్వరస్వామి ఆలయంలో శివుడ్ని పూజిస్తుంటారు. ఈ గుడిలో శివుడు భూ లింగంగా ఉంటాడు. తడిబట్టలతోనే భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. శివదర్శనం తర్వాత శనీశ్వరుడిని దర్శించుకుని మళ్లీ కొలనులో స్నానం చేసి ఆ బట్టల్ని వదిలేసి వేరే బట్టలు కట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్లిపోతుంటారు భక్తులు. ప్రతీ ఏటా జరిగే రథోత్సవానిక విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతూ ఉంటారు.

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×