BigTV English

Dhumavati : ధూమావతి దేవిని పూజిస్తే చెడు వ్యసనాలు పోతాయా…

Dhumavati : ధూమావతి దేవిని పూజిస్తే చెడు వ్యసనాలు పోతాయా…
 Dhumavati


Dhumavati : కొన్ని ఇళ్లల్లో కొంతమందికి చెడు వ్యసనాలకి బానిసలవుతుంటారు. తాగడం, తిరగడం, మద్యపానం ఇలాంటి వాటికి అలవాటపడి కుటుంబాన్ని బాధపెడుతూ ఉంటారు. ఇంటి యజమానికి చెడు అలవాటు ఉంటే ఇక ఆ కుటుంబానికి తల్లే ఆధారం. పిల్లలకి కష్టాలు తప్పువు. అలాంటి పరిస్థితుల నుంచి బయట పడాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటూ ఉంటారు. దేవుడ్ని మొక్కే వారు తమ జీవితంలో ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని నమ్ముతుంటారు. ఇలాంటి ఇళ్లల్లో చెడు వ్యసనాలకి బానిసలైన వారిని దారిలో పెట్టేందుకు ధూమావతి దేవిని పూజిస్తే చాలంటోంది శాస్త్రం. దశమహా విద్యల్లో కనిపించే అమ్మవారు ధూమావతి.

ధూమావతి మంత్రాన్ని జపించేటప్పుడు పిడికెడు అన్న తీసుకుని అందులో నెయ్యి వేసి దానిపై కుంకుమ వేసి దేవుడి గదిలో ఉంచాలి. పూజ చేసిన తర్వాత కుంకుమను ధరించాలి. తర్వాత కుంకమ చల్లిన ఆ అన్నాన్ని కాకికి పెట్టాలి. ధూమాదేవి కాకి రూపంలో సంచరిస్తుందట. ఆ తల్లికి అన్నం పెట్టి సంతృప్తి పరిస్తే చెడు వ్యసనాల నుంచి బయటపడేస్తుందట. 21 రోజులపాటు ఈ పూజా విధానాన్ని పాటిస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అనుభవపూర్వకంగా చెబుతున్నారు.


రామాయణ, భాగవతాలన్ని పారాయణం చేసే ఇళ్లల్లో బాధలు దూరమవుతాయి. చెడువ్యసనాలు ఉన్న వాళ్లు ఇలాంటి పారాయాలు చేస్తే మనలో ఉన్న పంచకోశాల్లో ప్రభావంచూపుతుంది. మనిషి ఆలోచనాధోరణితో మార్చే శక్తి మన పురాణగ్రంధాలకి ఉందని గట్టి విశ్వాసం ఉంది. అలాగే చెడువ్యసనాల నివారణకు కొన్ని రకాల హోమియోపతి మందులు ఉన్నాయి. వాటిని కూడాతీసుకున్నా సమస్యల నుంచి బయటపడటం సాధ్యమవుతుంది. మానసికమైన మార్పులు హోమియో పతి మందులతో నయమవుతుందని విశ్వాసం కూడా ఉంది.

Related News

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Big Stories

×