BigTV English

Puri jagannath temple : పూరీలో బంగారు పళ్లెంను మాయం చేసిదెవరు..?

Puri jagannath temple : పూరీలో బంగారు పళ్లెంను మాయం చేసిదెవరు..?
jagannath temple


Puri jagannath temple : జగన్నాధుడు కొలువైన పూరిలో ఏ ఆలయాన్ని చూసినా, ఏ విగ్రహాన్ని దర్శించుకున్నా , ఏ స్తంభాన్ని ముట్టుకున్నా వాటి వెనుక అద్భుతమైన చరిత్ర దాగి ఉంది. పూరీ జగన్నాథ ఆలయం మాడవీధుల్లో బయటకి వచ్చేటప్పుడు ఆగ్నేయం వైపు ఒక మురికి గుంట కనిపిస్తుంది. దాన్ని పేజ్ నాలాగా పిలుస్తారు. ఒక సమయంలో తనను నమ్ముకున్న కటిక పేదవాడైన ఒక వ్యక్తికి స్వామికి ఆలయంలో ఉపయోగించే బంగారం పళ్లెంలో 56 రకాల పదార్దాలు వండించి పెట్టి అదృశ్యమవుతాడు.

పళ్లెం కనిపించడం లేదని వెదికిన ఆలయ సిబ్బంది ఆ పేదవ్యక్తిని జైలులో బంధిస్తారు. తాము దొంగతనం చేయలన పేదోడి భార్య చెప్పినా ఎవరూ పట్టించుకోరు. ఆసమయంలో ప్రతాపరుద్రు మహారాజు కలలో స్వామి కనిపించి తన భక్తుడ్నుి చెరశాలలో వేసిన సంగతి చెప్పి విడిచిపెట్టమని ఆజ్ఞాపిస్తాడు. లేదంటో పూరీ క్షేత్రాన్ని విడిచిపోతానని స్వామి చెప్పారట. వెంటనే ప్రతాప రుద్రుడు ఆగమేఘాలపై వచ్చి పేదభక్తుడి కాళ్లమీద పడి క్షమాపణ కోరతాడు . స్వామి భక్తుడికి రాజ్యంలో కోశాధికారి పదవి ఇచ్చి గౌరవిస్తాడు. స్వామి తలుచుకుంటే జరిగేది ఇదే.


ఇదంతా పేజ్ నాలా దగ్గర జరిగింది. ఇప్పుడు ఆ పేజ్ నాల్ దగ్గర చిన్న కుటీరాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ అది కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో కూర్చుని జగన్నాధ స్వామిని స్మరిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పేజ్ నాలా ఆలయానికి దక్షిణ ఆగ్నేయంలో కనిపిస్తుంది. పూరిలో ఇలా గోడను వెతికినా ఏదో ఒక చరిత్ర ఉంటుంది. అవన్నీ తెలుసుకుని వెళ్లినప్పుడు మనసు ఆనందం పడుతుంది. మీరు సంతోషంగా ఉంటారు.

స్వామి ఏదైనా చెప్పాలనుకుంటే రథాన్ని ఆపుతాడు లేదంటే పాలకుల కలలోకి వచ్చి చెబుతాడట. జగన్నాథ రధచక్రాలు ముందుకు కదలడం లేదంటే ఏదో తప్పు జరిగి ఉండాలి. లేకపోతే స్వామి ఏదో చెప్పుతున్నారన్న సందేశం అయినా అయిండాలని స్వామి భక్తులు చెబుతుంటారు.

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×