BigTV English

Beeruva : బీరువాలో బట్టలతోపాటు ఇవి కలిపి పెట్టారా…?

Beeruva : బీరువాలో బట్టలతోపాటు ఇవి కలిపి పెట్టారా…?
Beeruva


Beeruva : ఇంట్లో నగలు, బట్టలు ఉండాలని మహిళలు కోరుకుంటూ ఉంటారు. అందుకే ఎన్ని చీరలున్నా, నగలు ఉన్నా ఇంకా కావాలని అడుగుతూ ఉంటారు. ఒళ్లంతా బంగారం కావాలనుకునేవారు, బోల్డన్నీ బట్టలు కావాలని కోరుకునే మహిళలు కొన్ని సూత్రాలు పాటిస్తే వారి కోరకి నెరవేరే దారి దొరుకుతుంది. కొన్ని తప్పులు చేయకుండా ఉంటే ఇల్లంతా బంగారమవుతుంది. బట్టల్లో కొన్ని వాష్ చేసుకునేవి ఉంటాయి. మరికొన్ని డ్రైవాష్ చేసేవి ఉంటాయి. డ్రైవాష్ చేసే బట్టల్ని ఒకసారి ధరించి పక్కన పెట్టి మళ్లీ మళ్లీ వేసుకోవడం తప్పంటోంది శాస్త్రం. ఒకసారి వేసుకున్న తర్వాత మళ్లీ వాష్ చేసిన తర్వాతే ఒంటిపై ధరించాలి.

ఒకసారి ధరించిన చీరను మళ్లీ తడపకుండా ధరిస్తే నవగ్రహాల్లో ఒకటైన శుక్ర ప్రభావం తగ్గిపోతుందని శాస్త్రం చెబుతోంది. ఇలా జరిగితే అన్నీ ఉన్నా ఏదో లేదన్న బాధ, మనసులో వెలితిగా ఉండిపోతుంది. మానసిక వేదనతో బతుకంతా నడుస్తూ ఉంటుంది. ఖరీదైన పట్టుచీరలు లాంటివి వాష్ చేసుకునే పరిస్థితి ఉండదు. కాని వాటిని మళ్లీ ధరించాల్సి వచ్చినప్పుడు చీర చివరి అంచులో చిన్న భాగాన్నైనా తడిపిన తర్వాతే వేసుకోవాలి. ఇలా పరిహారాన్ని పాటిస్తే దోషం పోతుంది. శుక్రుడి దోషం పోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం పొందుతారు. మానసిక ప్రశాంతంతో జీవిస్తారు.


బీరువాలో పెట్టే బట్టల మధ్య నగలు దాచే అలవాటు కొందరికి ఉంటుంది. కానీ అలా చేయడం మంచిది కాదు. బట్టల్లో నగలు దాచి ఉంచితే దోషం కలుగుతుంది. బంగారు నగలు, ఆభరణాలు గంధం చెక్కతో కానీ, చందనంతో కానీ తయారు చేయించిన బాక్సులోనే ఉంచాలి. మరో విషయం ఏంటంటే బంగారాన్ని, వెండిని కలిపి ఉంచకూడదు. బంగారం పెట్టే బాక్సులోనే వెండిని కలిపి పెట్టకూడదు. రెండింటిని వేరు వేరుగా ఉంచుకోవాలి. వెండి లక్ష్మీదేవి పుట్టినిల్లు అయితే..బంగారం లక్ష్మిదేవి మెట్టినిల్లు . శ్రీమన్నారాయణుడి దగ్గరే బంగారం ఉంటుంది. అందుకే పుట్టినిల్లు మెట్టినిల్లు ఒక దగ్గర ఉండకూడదు. అంటే బంగారం, వెండి కలిపి పెట్టకూడదు.

బీరువాలో బంగారం పెట్టినప్పుడు పక్కనే లోన్ డాక్సుమెంట్లతో కలిపి పెట్టకూడదు. అలాగే కోర్టు వివాద పత్రాలులాంటివి కూడా ఉంచకూడదు. బంగారు నగలను ఎలాంట డాక్యుమెంట్లతో కలిపి పెట్టకుండా విడిగా బాక్సులో మాత్రమే పెట్టుకోవడం ఇంటి ఇల్లాలికి, యజమానికి మంచిది. ఇలాంటి జాగ్రత్తలు పాటించినప్పుడే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది.

Tags

Related News

Srivari Chakrasnanam: శ్రీవారి చక్రస్నానంలో అద్భుతం.. రెండు కళ్లూ సరిపోవు

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Big Stories

×