రాశి సింగ్ (Rashi Singh).. ఇప్పుడు కుర్రాళ్ల లేటెస్ట్ క్రష్. ఈమెకు సినిమాలు పెద్దగా లేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం దండిగా అభిమానులు ఉన్నారు. ఎందుకంటే.. ఈమె అందాల ఆరబోత ఆ స్థాయిలో ఉంటుంది మరి.
సినిమాల్లో కాస్త పద్ధతిగా కనిపించినా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం గ్లామర్‌తో రచ్చ చేస్తుంది. ఆ పిక్స్ చూస్తే.. ఇంత ‘మంచి’ అమ్మాయికి అవకాశాల్లేవా.. డైరెక్టర్లు ఓ లుక్కేయండయ్యా అని చెప్పాలి అనిపిస్తుంది.
ఇంతకీ రాశీ సింగ్ ఏయే సినిమాల్లో నటించిందో చెప్పనే లేదు కదూ. మీరు ‘ప్రసన్నవదనం’ సినిమా చూసి ఉండకపోతే.. తప్పకుండా చూడండి. ఎందుకంటే.. అందులో ఈమెదే కీలక పాత్ర. ఆ సినిమా చూసినవారికి ఆమె పాత్రలో వేరియేషన్స్ తెలుస్తాయి.
‘ప్రసన్నవదనం’ సినిమాకు ముందు ఆమె.. అరడజన్ వరకు సినిమాలు చేసింది. 2019లో సాయి రామ్ శంకర్ హీరోగా నటించిన ‘రీసౌండ్’ అనే మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత 2021లో ‘శశి’ సినిమాలో నటించింది. అనంతరం 2023లో సంతోష్ శోభన్ హీరోగా నటించిన ‘ప్రేమ్ కుమార్’ మూవీలో సహనటిగా అలరించింది.
ఆ తర్వాత ‘పోస్టర్’, ‘జెమ్’ సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు. 2024లో వచ్చిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ మూవీతో ప్రేక్షకులకు కాస్త దగ్గరైంది. చివరికి ‘ప్రసన్నవదనం’తో గుర్తింపు వచ్చింది.
అందాల ఆరబోతకు ఏ మాత్రం వెనుకడుగు వేయని రాశీ సింగ్‌కు అవకాశాలు ఎందుకు రావడం లేదో.