బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్.. పాకిస్తాన్, బలూచిస్తాన్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. సౌదీ అరేబియాలోని రియాద్ లో జరిగిన జాయ్ ఫోర్ 2025లో పాల్గొన్న ఆయన, బలూచిస్తాన్, పాకిస్తాన్ ను విడి విడిగా ప్రస్తావించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టిట వైరల్ అవుతుంది. అంతేకాదు, పాక్, బలూచిస్తాన్ నెటిజన్లు ఈ వీడియోపై వ్యతిరేక, సానుకూల వ్యాఖ్యలు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మిడిల్ ఈస్ట్ లోని సౌత్ ఏషియా సమాజాలలో భారతీయ సినిమాలకు పెరుగుతున్న ప్రపంచ ఆకర్షణ గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్, బలూచ్ ను వేర్వేరుగా ప్రస్తావించారు. “ప్రస్తుతం, మీరు ఒక హిందీ సినిమా తీసి సౌదీ అరేబియాలో విడుదల చేస్తే, అది సూపర్ హిట్ అవుతుంది. ఒక తమిళ, తెలుగు, మలయాళ సినిమా తీస్తే, అది వందల కోట్ల వ్యాపారం చేస్తుంది. ఎందుకంటే, ఇతర దేశాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ బలూచిస్తాన్ ప్రజలు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఉన్నారు. పాకిస్తాన్ ప్రజలు ఉన్నారు. అందరూ ఇక్కడ పనిచేస్తున్నారు” అని చెప్పుకొచ్చారు.
I don’t know if it was slip of tongue, but this is amazing! Salman Khan separates “people of Balochistan” from “people of Pakistan” .
pic.twitter.com/dFNKOBKoEz
— Smita Prakash (@smitaprakash) October 19, 2025
నిజానికి ఈ క్లిప్ లో పాకిస్తాన్, బలూచిస్తాన్ వేర్వేరు దేశాలు అన్నట్లుగా సల్మాన్ ప్రస్తావించారు. గత కొంత కాలంగా బలూచ్ ప్రజలు పాక్ నుంచి విడిపోయేందుకు ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. కొన్నసార్లు సాయుధ దాడులకు దిగుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో పాకిస్తాన్ సైన్యంపై అటాక్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ రైళ్ల మీద దాడులు చేస్తున్నారు. ఆ దేశ రైళ్లను హైజాక్ చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో సల్మాన్ పాకిస్తాన్, బలూచిస్తాన్ అంటూ మాట్లాడ్డం పట్ల బలూచ్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సల్మాన్ ఖాన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. ఇంతకీ ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యాఖ్యలు చేశారా? లేదంటే పొరపాటుగా నోరు జారారా? అని చర్చించుకుంటున్నారు. జర్నలిస్ట్ స్మితా ప్రకాష్ ఈ క్లిప్‌ను షేర్ చేసి, “ఇది నోరు జారి అన్నారా? లేదా? అనేది నాకు తెలియదు. కానీ, అద్భుతం! సల్మాన్ ఖాన్ బలూచిస్తాన్ ప్రజలను, పాకిస్తాన్ ప్రజల నుంచి వేరు చేశాడు” అని రాసుకొచ్చింది. “బలూచిస్తాన్ పాకిస్తాన్ ప్రావిన్స్ కాదు. ఇది ఒక దేశం. బలూచ్ మా గుర్తింపు. మా దేశం” అని జాస్మిన్ అహ్మద్ అనే బలూచ్ యువకుడు కామెంట్ చేశాడు.”సల్మాన్ ఖాన్ కూడా బలూచిస్తాన్ ఒక ప్రత్యేక దేశం అని అంగీకరించారు” అని మరొక యూజర్ జబీర్ రాసుకొచ్చాడు. చాలా మంది నెటిజన్లు సల్మాన్ వ్యాఖ్యలు సమర్థించారు. అయితే, ఈ రచ్చపై సల్మాన్ ఖాన్ లేదంటే అతడి టీమ్ ఇంకా స్పందించలేదు. ఈ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ తో పాటు షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ సహా ఇతర బాలీవుడ్ సూపర్‌స్టార్లు పాల్గొన్నారు.