BigTV English
Advertisement

Allu Sirish : ఇదేం ట్రెండ్ బాబు.. మెడలో నెక్లేస్ తో అల్లు శిరీష్..ఫోటోలు వైరల్..

Allu Sirish : ఇదేం ట్రెండ్ బాబు.. మెడలో నెక్లేస్ తో అల్లు శిరీష్..ఫోటోలు వైరల్..

Allu Sirish : టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ రెండో కుమారుడు అల్లు శిరీష్ ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకునే విషయం తెలిసిందే. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అక్టోబర్ 31 న హైదరాబాద్ లోనే ఇరుకుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల మధ్య వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది.. నైనిక రెడ్డితో ప్రేమలో పడ్డ అల్లు శిరీష్ మొత్తానికి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను అల్లు శిరీష్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.. ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతేకాదు అల్లు శిరీష్ మెడలో నెక్లెస్ తో కనిపించిన ఫోటో కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది..


నెక్లేస్ తో అల్లు శిరీష్ పిక్స్..

నైనిక రెడ్డీతో చేసుకున్న ఎంగేజ్మెంట్ ఫోటోలను అల్లు శిరీష్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఆ ఫోటోలలో ఒక ఫోటోలో ఆయన మెడలో నెక్లెస్ తో కనిపించినట్లు ఉంది.. నెక్లెస్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.. వాటిని చూసిన అభిమానులు ఇదేమి ఫ్యాషన్ భయ్యా.. ఆడవాళ్ళలాగా నెక్లెస్ వేసుకున్నావ్ ఏంటి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. సాధారణంగా మగవారు ఇలాంటి నెక్లెస్ లు పెట్టుకోరు. పైగా హీరోగా ఉన్న శిరీష్ ఇలా ఎందుకు పెట్టుకున్నాడని అంతా చర్చించుకుంటున్నారు. పోనీ అల్లు వారి ఇంట్లో అలాంటి సంప్రదాయం ఏమైనా ఉందా అని ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఈ ఫోటోలు అయితే మాత్రం ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నెక్లెస్ సంగతి పక్కన పెడితే ఈ జంట చూడముచ్చటగా ఉంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Also Read :దారుణంగా పడిపోయిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్.. అతనే విన్నర్..?


అల్లు శిరీష్ – నైనికల పెళ్లి అప్పుడేనా..? 

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. అయితే అందులో కేవలం కొత్తజంట సినిమా మాత్రమే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయాయి.. అలా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ కుర్ర హీరో బడ్డీ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వకపోయిన సరే పర్వాలేదనే టాక్ ని అందుకుంది.. ఆ తర్వాత సినిమాలు అనౌన్స్ చేయలేదు కానీ త్వరలోనే పెళ్లి కొడుకు కాబోతున్నట్లు ప్రకటించాడు.. రీసెంట్ గా నైనిక రెడ్డి తో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అయితే వీరి పెళ్లి డేట్ ఎప్పుడు ఉంటుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు.. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి లేదా ఫిబ్రవరి సెకండ్ వీక్ లో వీరి పెళ్లి జరుగుతుందని సమాచారం.. త్వరలోనే డేట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది.. ఈమధ్య పెళ్లి చేసుకున్న హీరోలందరూ మంచి సక్సెస్ సినిమాలని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. మరి శిరీష్ కూడా పెళ్లి తర్వాత హిట్ సినిమాలో నటిస్తాడేమో చూడాలి.

Related News

Actress Jyothi : నటి జ్యోతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? వైరల్ అవుతున్న ఫోటోలు..

Kaantha: ఊదేయడానికి దుమ్ము కాదు.. నేనొక పర్వతం.. కాంత ట్రైలర్ రిలీజ్!

November 7 Movie Releases : రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఫోకస్ ఆ మూవీపైనే..

Tollywood Directors: ట్రెండింగ్ లో తెలుగు దర్శకులు.. ఈ దర్శకుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?

Lokesh kanakaraj : క్రేజీ న్యూస్.. ఆ స్టార్ హీరోతో తమిళ డైరెక్టర్ మూవీ ఫిక్స్..?

Malaika Arora: మలైకా బోల్డ్ స్టేట్మెంట్.. కోరిక తీరాలంటే పెళ్లి అక్కర్లేదు అంటూ!

Vishnu Vishal: నా సినిమాకి 21 మంది నిర్మాతలు మారారు.. అసలు విషయం చెప్పిన హీరో!

Big Stories

×