Tejaswini Nandamuri: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వారసత్వంలో భాగంగా తన కుమారులు కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వారందరిలో కూడా బాలకృష్ణ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నారు. ఒకవైపు సినిమాల్లో రాణిస్తూనే మరోవైపు పాలిటిక్స్ లో కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నారు.
బాలకృష్ణ కుమార్తె తేజస్విని రీసెంట్గా ఒక జ్యువెలరీ సంబంధించిన యాడ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఆ యాడ్ బాగా పాపులర్ అయింది. యాడ్స్ ట్రెండింగ్ లో ఉండటం అనేది రేర్ జరుగుతుంది. ఈ యాడ్ కు దర్శకత్వం వహించారు యమునా కిషోర్. యమున కిషోర్ ఇప్పటివరకు దాదాపు 500 కు పైగా యాడ్ ఫిలిమ్స్ చేశారు. వాటిలో మంచి పేరు తెచ్చినవి కూడా ఉన్నాయి.
అయితే ప్రస్తుతం యమున కిషోర్ చేసిన యాడ్ బాగా పాపులర్ అవ్వడానికి కారణం సోషల్ మీడియా అని చెప్పాలి. ఒకవైపు వారసత్వ నటులను అభిమానులు ఎలా ఎంకరేజ్ చేస్తారో చాలా సంవత్సరాల నుంచి ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు కేవలం ఒక యాడ్ ఫిలిం చేస్తేనే తేజస్విని కు విపరీతమైన రెస్పాన్స్ దక్కుతుంది.
అయితే ఈ యాడ్ ఫిలిం దర్శకత్వం వహించిన యమునా కిషోర్ రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. తాను ఇప్పటివరకు దాదాపు 500 కు పైగా యాడ్స్ చేశానని అంతేకాకుండా చాలామంది స్టార్ హీరోలు కూడా ఇతని దర్శకత్వంలో యాడ్స్ లో నటించారు అని చెప్పుకొచ్చాడు.
అప్పట్లో మరాఠీ యాడ్ బాగా పాపులర్ అయింది. కానీ దానిని నేను సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోయాను. ఈ యాడ్ కి సంబంధించి చాలా మంది ప్రముఖులు ఫోన్లు కూడా చేశారు వాళ్ల పేర్లు నేను చెప్పలేను. ముఖ్యంగా బాలయ్య బాబు అభిమానులు అయితే విపరీతమైన ఫోన్స్ చేసి ప్రశంసించారు. బాలకృష్ణ గారు కూడా ఈ యాడ్ చూసి హ్యాపీగా ఫీలయినట్లు కొంతమంది అభిమానులు నాతో చెప్పారు అని యమునా కిషోర్ ఇంటర్వ్యూ లో చెప్పారు.
Also Read: Jatadhara trailer : ఇంకెన్ని రోజులు అవే దయ్యాలు కథలు? ఈ దర్శక నిర్మాతలు మారరా?