BigTV English

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!
Advertisement

Producer Bandla Ganesh Home:

ప్రముఖ నిర్మాత, సినీ నటుడు బండ్ల గణేష్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కామెడీ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆయన ప్రస్తుతం బడా నిర్మాతగా మారిపోయాడు. పవన్ కల్యాణ్ కు తాను భక్తుడిని అని చెప్పుకునే గణేష్.. ఓ ఆంధ్రా పొలిటీషియన్ కు బినామీ అనే ఆరోపణ కూడా ఉంది. నిత్యం తనదైన శైలిలో కామెంట్స్ చేసే ఆయన, ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా తన ఇంట్లో దీపావళి వేడుకలను అట్టహాసంగా జరిపారు. సినీ, రాజకీయ ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించాడు. చిరంజీవి, వెంకటేష్, శ్రీకాంత్ వంటి సీనియర్ హీరోలతో పాటు యంగ్ యాక్టర్లు తేజ సజ్జా, సిద్ధు జొన్నలగడ్డ, అగ్ర దర్శకుడు, అగ్ర నిర్మాతలు హాజరయ్యారు. పలువురు రాజకీయ నాయకులు కూడా బండ్లన్న ఇంటికి తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ వేడుకలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇంద్రభవనాన్ని తలపిస్తున్న బండ్లన్న

బండ్ల గణేష్ దీపావళి వేడుకల వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఆయన ఇళ్లును చూసి ఆశ్చర్యపోతున్నారు. రెండు అంతస్తుల్లో నిర్మించిన ఈ ఇల్లు మొదటి అంతస్తులో ఆఫీస్, రెండో అంతస్తులో ఆయన ఫ్యామిలీ నివాసం ఉంటుంది. పైన పెంట్ హౌస్ నిర్మించారు. విశాలమైన గదులు, చక్కటి లివింగ్ హాల్, డైనింగ్ హాల్, తనకు వచ్చిన ప్రశంసా పత్రాలు, బహుమతులతో నిండిన ఆయన ఆఫీస్ ఆహా అనిపిస్తున్నాయి. గణేష్ ఇంట్లో ఎక్కడ చూసినా అద్భుతమైన సోఫాలు ఆకట్టుకుంటున్నాయి. ఆయన వాహనాలను నిలిపేందుకు గ్రౌండ్ ప్లోర్ ను ప్రత్యేకంగా కేటాయించారు. ఇంట్లోని విశాలమైన గార్డెన్ కూడా అందంగా ఆకట్టుకుంటుంది. చక్కటి పూల మొక్కలో పాటు గార్డెన్ అలరిస్తుంది. ఇక బండ్ల గణేష్ ఇల్లు అందరూ వావ్ అంటున్నారు. సాధారణ కమెడియన్ గా కెరీర్ ప్రారంభించి, స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగిన గణేష్.. ఆయన అభిరుచికి తగినట్లుగా అద్భుతంగా నిర్మించారంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, ఈ ఇల్లు దర్శకుడు వివి వినాయక్ ఎంతో ఇష్టంగా కట్టుకున్నారని, ఆ తర్వాత దాన్ని బండ్ల గణేష్ కొనుక్కున్నాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


దీపావళి వేడుకలకు ఎంత ఖర్చు చేశాడంటే?

ఇక బండ్ల గణేష్ తాజాగా నిర్వహించిన దీపావళి వేడుకలకు పెద్ద మొత్తంలో ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంటి అలంకరణ నుంచి మొదలుకొని, అతిథుల ఆహ్వానం వరకు ప్రతిదీ గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ప్రత్యేక సిబ్బందితో నోరూరించే విందును ఏర్పాటు చేయించారు. ఈ పార్టీ కోసం ఆయన ఏకంగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

 బండ్ల గణేష్ గురించి ఎస్కేఎన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఇక తాజాగా బండ్ల గణేష్ గురించి నిర్మాత ఎస్కేఎన్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. గత కొంత కాలంగా బండ్లన్న ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. గణేష్ లాంటి నిర్మాత ఇండస్ట్రీకి దూరంగా ఉండడం సినిమా పరిశ్రమకు మంచిది కాదన్నారు. ఆయన మరెన్నో సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. మేధావి మౌనం దేశానికి ఎంత ప్రమాదమో, గణేష్ లాంటి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్ కి దూరంగా ఉండట ఇండస్ట్రీకి అంత ప్రమాదం అన్నారు.

Read Also: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Related News

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Big Stories

×