ACB Raids: ఒకే రోజు.. 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు.. ఏసీబీ ఈ మధ్య కాలంలో చేపట్టిన యాంటీ కరప్షన్ ఆపరేషన్ ఇది. మాములుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు అవినీతి కేంద్రాలనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఏపీ ఏసీబీ అధికారులు వీటిపైనే ఫోకస్ చేశారు. ఒకేరోజు ఏపీ వ్యాప్తంగా ఉన్న 120 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఫైళ్లను తనిఖీలు చేశారు. మొత్తం కార్యాలయాన్ని మూసేసి.. సిబ్బందిని విచారించారు.
ఏసీబీ దాడులతో స్టాంప్ రైటర్లు అప్రమత్తమయ్యారు. షాపులను మూసేశారు. ఏసీబీ అధికారుల రాకను గమనించిన పలువురు ఉద్యోగులు తమ జేబుల నుంచి డబ్బును కిటికీల నుండి బయటకు విసిరేశారు. దీనిని బట్టే అర్థమవుతోంది ఏసీబీ రెయిడ్స్ ఎఫెక్ట్. విశాఖ, విజయనగరం, ఎన్టీఆర్, ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు, పల్నాడు జిల్లా నరసరావుపేట తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి.
విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఏసీబీ సోదాలు నిర్వహిస్తుంది. మధురవాడ, పెదగంట్యాడలోని రిజిస్టర్ రీజనల్ ఆఫీసు.. విజయనగరం జిల్లాలోని భోగాపురం రిజిస్టర్ ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్పీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు సిబ్బందిని విచారిస్తున్నట్లు సమాచారం. ఇక అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. తలుపులు మూసి సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ఫిర్యాదులు రావడంతోనే దాడులకు దిగినట్లు తెలుస్తుంది. ఏసీబీ రాకతో అప్రమత్తమైన స్టాంప్ రైటర్లు, షాపులను మూసివేశారు.
నెల్లూరులోని స్టోన్ హౌస్ పేట సబ్ రిజిస్టరు కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పలు ఫైళ్లను తనిఖీలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రిజిస్ట్రేషన్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో కొంత మంది ఉద్యోగులు తమ జేబుల్లో ఉన్న నగదును బయటకు విసిరేయడం అక్కడ కొంతసేపు హడావుడికి దారితీసింది. 30వేల రూపాయలు నగదును ఉద్యోగులు కిటికీలో నుండి బయటకు విసిరివేయగా ఆ నగదును అధికారులు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు. అదేవిధంగా మరో పదివేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నారు. మరి కొందరు ఉద్యోగుల వద్ద కూడా నగదు స్వాధీనం చేసుకొని విచారణ చేస్తున్నారు.
Also Read: ఎవరీ జొహ్రాన్ మమ్‌దానీ? న్యూయార్క్ మేయర్ బ్యాక్ గ్రౌండ్ ఇదే
ఇలా దాదాపు అన్ని జిల్లాల్లోని రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల మేరకే ఈ తనిఖీలు నిర్వహించినట్టు అధికారులు తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా 12 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నంలో లెక్కచూపని నగదు గుర్తింపు
ఒంగోలు, నరసరావుపేటలో లెక్కచూపని నగదు గుర్తింపు
రూ.10 వేల నుంచి రూ.75 వేల మేర లెక్కచూపని నగదు గుర్తింపు
రిజిస్ట్రేషన్ వివరాలు, స్టాంపు పేపర్ల… pic.twitter.com/2eHcYfSwFj
— BIG TV Breaking News (@bigtvtelugu) November 5, 2025