Kantara 2: ప్రముఖ కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి (Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం కాంతార(Kantara ). 2022లో వచ్చిన ఈ సినిమా సంచలనం సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల వసూలు చేసి హీరో రిషబ్ శెట్టికి పాన్ ఇండియా హీరోగా గుర్తింపును అందించింది. ఈ సినిమా ఇచ్చిన విజయంతో ఈ సినిమాకి ముందు ఏం జరిగింది అనే విషయాలను తెరపైకి తీసుకొస్తూ..కాంతార చాప్టర్ 1 అంటూ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు రిషబ్ శెట్టి. ఈ సినిమా ఏకంగా రాజమౌళి (Rajamouli) ‘బాహుబలి’ రికార్డులను కూడా బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. అయితే ఇలాంటి సినిమాకు సంబంధించిన ఒక విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
అజనీష్ లోకనాథ్ (Ajaneesh loknath) అందించిన ఈ సినిమా మ్యూజిక్, బిజిఎం ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఒక దివ్యాంగుడు.. చూపు లేకపోయినా టాలెంట్ ఎవరి సొత్తు కాదని నిరూపించారు. అసలు విషయంలోకి వెళ్తే.. తన మనోధైర్యాన్ని ఆయుధంగా మార్చుకున్న ఆయన.. ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచిన కాంతార సినిమాలోని బిజిఎంను తన నోటితోనే స్వరింపజేసి అందరి చేత ఔరా అనిపించారు. ముఖ్యంగా ఈ బీజీయంలోని ప్రతి భాగాన్ని, సంగీతాన్ని నోటితో అలవోకగా పలికిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.. ప్రస్తుతం ఈ అద్భుత ప్రదర్శనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ముఖ్యంగా ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా కట్టిపడేస్తోందని చెప్పవచ్చు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు.. ఈ దివ్యాంగుడి టాలెంట్ కి అధరహో అనాల్సిందే అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా టాలెంట్ ఉండాలే కాని ఎలాంటి వైకల్యాన్ని అయినా జయించగలము అని ఈ దివ్యాంగుడు నిరూపించారు.
కాంతార చాప్టర్ 1 విషయానికి వస్తే.. రుక్మిణీ వసంత్ హీరోయిన్గా , గుల్షన్ దేవయ్య విలన్ గా.. జయరాం కీలక పాత్రలో నటించిన చిత్రం కాంతారా చాప్టర్ 1. గాంధీ జయంతి, దసరా సందర్భంగా.. అక్టోబర్ 2న విడుదలైన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే రూ.700 కోట్ల క్లబ్లో చేరిన ఈ సినిమా 1000 కోట్ల దిశగా అడుగులు వేస్తోందని చెప్పవచ్చు. విడుదలయి పది రోజులకు పైగానే అవుతున్నా.. ఇంకా ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ఇకపోతే ఈ సినిమా క్లైమాక్స్లో కాంతార చాప్టర్ 2 కూడా ఉంటుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని దక్షిణాది సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు.
రిషబ్ శెట్టి విషయానికి వస్తే.. ఒకప్పుడు డైరెక్టర్గా తన కెరీర్ను మొదలుపెట్టిన ఈయన ఆ తర్వాత హీరోగా మారి పలు చిత్రాలు చేశారు. ఇక కాంతార సినిమాతోనే లైమ్ లైట్ లోకి వచ్చిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించారు.
ALSO READ: Bigg Boss Srija: తేరుకోలేకపోతున్న శ్రీజ.. జాబ్ కూడా వదిలేసా అంటూ ఎమోషనల్!