BigTV English

Bigg Boss 8 Sonia : హౌస్ లో సీక్రెట్ ఎఫైర్స్ పై సోనియా బాంబ్.. ఇంత పచ్చిగా చెప్పేసిందేంటి? 

Bigg Boss 8 Sonia : హౌస్ లో సీక్రెట్ ఎఫైర్స్ పై సోనియా బాంబ్.. ఇంత పచ్చిగా చెప్పేసిందేంటి? 

Bigg Boss 8 Sonia : బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడిప్పుడే ట్రాక్ లోకి పడింది.. ఐదు వారాలకు 6 మెంబెర్స్ హౌస్ నుంచి బయటకు వచ్చేసారు. నాలుగో వారం బయటకు వచ్చిన సోనియా హౌస్ లో జరిగిన వాటిని సోనియా బయట పెడుతూ వస్తుంది. హౌస్‌లో ఉన్నప్పుడు ఆమె బాగోతాలంటూ చిత్రీకరించారు. కానీ.. బయటకు వచ్చిన తరువాత అసలు బాగోతం ఏంటో తనని ఏవిధంగా బ్యాడ్ చేశారో చెప్పుకొచ్చింది. మొన్న తన గురించి బయట పెట్టింది. ఇప్పుడు హౌస్ ఎఫైర్స్ ఇవే అంటూ చెప్పి అందరికి షాక్ ఇచ్చింది. సోనియా ఎవరి గురించి బయట పెట్టిందో ఇప్పుడు ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సోనియా మొత్తం గుట్టు రట్టు చేసింది. తాజాగా ఆమె మాట్లాడుతూ.. హౌస్‌లో కిచెన్ వర్క్ అంతా చూసుకున్నా. రేషన్ కంట్రోల్ చేశా. హౌస్ మొత్తం బాధ్యత తీసుకున్నా. టాస్క్‌లలో ఇరగదీశా. కానీ మీకు చూపించింది మాత్రం అంతా తప్పుగానే, నిఖిల్, పృథ్వీలతో ఉన్నదే. పోనీ చూపించింది. పూర్తిగా చూపించకుండా అంతా కట్ చేసి ప్రేక్షకులకు నన్ను బరితెగించిన అమ్మాయిల చూపించారు. అక్కడ జరిగింది వేరు అని ఆసక్తికర విషయాలను పంచుకుంది. పృథ్వీ, నిఖిల్‌లను వాడుకుంటున్నా అని చెప్పింది సోనియా. నేను ఎప్పుడు ఆమె స్థాయికి దిగజారలేదు. నా హగ్‌లు చేతులు వేయడాన్నే చూపించారు.. దానికి ముందు వెనుక తీసేసి వాళ్లకి ఏం కావాలో అదే చూపించుకున్నారు బిగ్ బాస్ అని సంచలన విషయాలను బహిర్గతం చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

హౌస్ లో ఉన్నప్పుడు పృథ్వీ వచ్చి నన్ను నన్ను హగ్ చేసుకుని కిస్ చేశాడు. దాన్ని కూడా తప్పుగా చూపించారు. నేను ఆడలేనని అన్నప్పుడు.. ఆ టాస్క్‌లో నేను గెలిచాను. ఆ సంతోషాన్ని నాతో పంచుకున్నారు. ఇక అదే ఓ రేంజులో ఎడిటింగ్ చేసి నన్ను జూమ్ చేస్తూ హైలెట్ చేసుకున్నారు. హౌస్ లో ఉన్నంతసేపు నన్ను ఫోకస్ చెయ్యడం ఎందుకు… కేవలం చేతులు వెయ్యడం హగ్, చేసుకోవడం ఈ రెండు హైలెట్ చేశారు. పూర్తిగా చూపించి ఉంటే ఆడియన్స్ కు నిజం తెలిసేది. కానీ షోను ముందుకు తీసుకెళ్లడం కోసం ఇంత దారుణంగా మారారు. ఒక్క మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ కు బుద్ది లేని పనులు చేసి చూపించారు. అందరికీ ఎఫైర్స్ ఉన్నాయి ఇప్పుడు బయటకు వస్తాయి. అంటూ వరుసగా ఇంటర్వ్యూ లకు వెళ్తున్న సోనియా చెబుతుంది.  ప్రస్తుతం హౌస్ నుంచి సోనియా ఇస్తున్న ఇంటర్వ్యూ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.. హౌస్ లో ఉన్నంతవరకు దత్త పుత్రికలా ఉన్న ఆమె ఇప్పుడు ఇలా మారడం ఏంటని ప్రశ్నలు కురిపిస్తున్నారు..ఇక ఆదిత్య, నైనిక ఎలా చెబుతారో చూడాలి..


Related News

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Bigg Boss 9 Telugu: గొడవలు మాయం.. స్నేహం మాత్రం ఎప్పటికీ.. ఫ్రెండ్షిప్ డే స్పెషల్ వీడియో!

Ariyana: సొంత ఇంటికల నెరవేర్చుకోబోతున్న అరియానా.. తెగ కష్టపడుతుందిగా?

Big Stories

×