Telugu Heroes : డబ్బు కోసం చాలామంది చాలా రకాల దారులను ఎంచుకుంటూ ఉంటారు. కొంతమంది ఒక పని చేస్తూనే.. మరొక పని చేస్తూ సక్సెస్ అవుతారు.అలా రెండు విధాల డబ్బు సంపాదిస్తారు. అలా మన ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది స్టార్ హీరోలు సైతం ఓవైపు సినిమా రంగంలో రాణిస్తూనే.. మరోవైపు బిజినెస్ లు చేసి బిజినెస్ లలో కూడా సక్సెస్ అవుతూ ఉంటారు. అయితే మన ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు, సెలబ్రిటీలు కొంతమంది సినిమాల్లో రాణించడమే కాకుండా ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టి అందులో కూడా సక్సెస్ అయ్యారు.మరి టాలీవుడ్ లో లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు ఎవరు..? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? అనే సంగతి ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుడ్ బిజినెస్ అనే ఆలోచనకి బీజం వేసిందే అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna).ఆయన సినిమాలతో పాటు “ఎన్ ఏషియన్”, “ఎన్ గ్రిల్” అనే పేరుతో లగ్జరీ రెస్టారెంట్స్ ని రన్ చేస్తున్నారు. ఈ లగ్జరీ రెస్టారెంట్ జూబ్లీహిల్స్ లో ఉంది. ఈ రెస్టారెంట్ లు భారతీయ వంటకాలతో పాటు ఇటాలియన్, పాన్ ఏషియన్ కి సంబంధించిన వంటకాలకు ఫేమస్..
అల్లు అర్జున్ (Allu Arjun) పాన్ ఇండియా హీరోగానే కాదు రెస్టారెంట్ బిజినెస్ లో కూడా రాణిస్తున్నారు. అలా అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో “బఫెలో వైల్డ్ వింగ్స్” అనే లగ్జరీ రెస్టారెంట్లో పార్ట్నర్ గా ఉన్నారు. ఈ రెస్టారెంట్లో మటన్,చికెన్,బీఫ్ తో పాటు పోర్క్ వంటి నాన్ వెజ్ వంటకాలకు ప్రసిద్ధి. అలాగే గ్రిల్డ్ పనీర్ వంటి వెజ్ వంటకాలు కూడా ఇక్కడ లభిస్తాయి.అల్లు అర్జున్ కేవలం ఇండియాలోనే కాదు అమెరికా లోనూ ఓ రెస్టారెంట్ లో కూడా పెట్టుబడులు పెట్టారట.
అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) తండ్రి బాటలోనే రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారు. అలా “క్లౌడ్ కిచెన్” పేరుతో షోయు ని రన్ చేస్తున్నారు. ఇందులో కొరియన్ రామెన్, సూషి, పాన్ ఏషియన్ వంటకాలు లభిస్తాయి. “స్కుజీ” పేరుతో మరో బ్రాండ్ ని కూడా ఓపెన్ చేశారు. ఇది హైదరాబాదులోని మాదాపూర్ లో ఉంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కూడా ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. అయితే ఈ ఫుడ్ బిజినెస్ ని మహేష్ బాబు కాకుండా ఆయన భార్య నమ్రత చూసుకుంటుంది. అలా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో మహేష్ బాబు “ఏఎన్ రెస్టారెంట్” ని స్టార్ట్ చేశారు.ఈ రెస్టారెంట్ ఏషియన్ గ్రూప్ మినర్వా కాఫీ షాప్ తో కలిపి పార్ట్నర్ షిప్ తో ప్రారంభమైంది. ఈ రెస్టారెంట్లో ఇండియన్ ట్రెడిషనల్ వంటకాలతో పాటు యూరోపియన్,ఇటాలియన్ వంటి వెరైటీలు కూడా ఈ రెస్టారెంట్లో లభిస్తాయి..
ఆనంద్ దేవరకొండ (Anand Deverakonda) తన అన్న విజయ్ దేవరకొండ సహాయంతో “గుడ్ వైబ్స్ ఓన్లీ కేఫ్” అనే కేఫ్ ని ప్రారంభించారు. ఇది హైదరాబాద్ లోని ఖాజాగూడాలో ఉంది. ఈ కేఫ్ లో పిజ్జాలు, స్పెషల్ బర్గర్స్, పాస్తాలు,టర్కీ ఫుడ్ తో పాటు కూర్గ్ కాఫీ కూడా లభిస్తుంది.. ఈ కేఫ్ లో కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతం నుండి తీసుకొచ్చిన కాఫీ బీన్స్ తో తయారుచేసిన కాఫీ ఫేమస్..
దగ్గుబాటి రానా (Daggubati rana) తన పూర్వీకులకు సంబంధించినటువంటి ఇంటిని బార్ గా మార్చాడు. అందులో ఓ ప్రైవేట్ డైనింగ్ హాల్ తో పాటు ప్రత్యేక బార్ సదుపాయాన్ని కూడా కల్పించాడు.అలా “సాంక్చ్యూరి బార్ అండ్ కిచెన్ బ్రాడ్ వే” అనే రెస్టారెంట్ ని జూబ్లీహిల్స్ లో ప్రారంభించారు. ఇందులో పాన్ ఏషియన్,ఇండియన్ మెనూ తో పాటు ఇటాలియన్ ఫుడ్ కూడా లభిస్తుంది. అలాగే ప్రత్యేక బార్ సదుపాయం కూడా ఉంది.
రేసుగుర్రం, కిక్ వంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి కూడా ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. “ఉలవచారు” అనే పేరుతో ఒక రెస్టారెంట్ ని ప్రారంభించి.. ఇందులో తెలంగాణ, ఆంధ్ర స్టైల్ వంటకాలతో పాటు ఉలవచారు బిరియాని కి ఈ రెస్టారెంట్ కేరాఫ్ అడ్రస్ గా మార్చేశారు. ఈ రెస్టారెంట్ బ్రాంచ్ లు జూబ్లీహిల్స్ , గచ్చిబౌలి వంటి ప్రాంతాలలో ఉన్నాయి.
నటుడు సందీప్ కిషన్ (Sandeep Kishan) కూడా “వివాహ భోజనంబు” అనే పేరిట ఓ రెస్టారెంట్ ని ఓపెన్ చేశారు. ఈ వివాహ భోజనంబు రెస్టారెంట్లో ఆంధ్ర, తెలంగాణ తో పాటు సౌత్ లో ఫేమస్ అయినటువంటి పలు సాంప్రదాయక వంటకాలు లభిస్తాయి. వివాహ భోజనంబు రెస్టారెంట్ కి పలుచోట్ల బ్రాంచ్ లు ఉన్నాయి. అలా హైదరాబాద్ తో పాటు వైజాగ్ లో కూడా ఈ రెస్టారెంట్ ని రన్ చేస్తున్నారు.
హీరో శర్వానంద్ (Sharwanandh) “బీంజ్ ” అనే కేఫ్ ని జూబ్లీహిల్స్ లో స్టార్ట్ చేశారు.. ఈ కేఫ్ లో వివిధ రకాల కాఫీలతో పాటు టీ కూడా లభిస్తుంది. అలాగే పునుగులు,అరటికాయ బజ్జి, మిర్చి బజ్జి వంటి స్నాక్స్ కూడా లభిస్తాయి.
దర్శకుడిగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న కూచిపూడి వెంకట్ కూడా ఫుడ్ బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టారు. ఈయన “కిచెన్ ఆఫ్ కూచిపూడి, ఉలవచారు బిర్యానీ, మారేడుమిల్లి ఫారెస్ట్ గ్రిల్ అండ్ బార్, 7 బిరియానీస్, వంజారం, కింగ్ దమ్ బిర్యాని” వంటి పేర్లతో రెస్టారెంట్లు ఉన్నాయి.ఇవి హైదరాబాద్ తో పాటు గోవా, యూఎస్ఏలలో ఉన్నాయి.
విలన్ గా.. కామెడీ విలన్ గా..క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా..ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుబ్బరాజు కూడా పలు ఫుడ్ బిజినెస్ లు ఉన్నాయి. సుబ్బరాజుకి హైదరాబాద్ లో కాఫీ షాప్ లతోపాటు పబ్బులు కూడా ఉన్నాయి.
కామెడీ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించిన నటుడు శశాంక్ (Sashank)కి “మాయాబజార్” పేరిట హైదరాబాదులోని కార్ఖానా ప్రాంతంలో రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో ఆంధ్ర, తెలంగాణకు సంబంధించిన సాంప్రదాయ వంటకాలు అన్ని లభిస్తాయి.
ALSO READ:Parineeti Chopra: పరిణీతి ఒకప్పుడు ఆ స్టార్ హీరోయిన్ కి పీఆర్ గా చేసిందని తెలుసా?