Illu Illalu Pillalu Today Episode November 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. నర్మదా భద్రావతి సేన వాళ్ళ ప్రాపర్టీ లను సీజ్ చేయిస్తుంది.. అక్కడికి వచ్చిన భద్రాసేన ఇద్దరు కూడా నర్మదతో మాట్లాడతారు.. ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ మీకు ఆల్రెడీ నోటీసులు పంపాం మీరు రెస్పాండ్ అవ్వలేదు అందుకే సీజ్ చేశామని అంటుంది.. ఎంత ధైర్యం ఉంటే మా వస్తువులనే సీజ్ చేస్తావు అని నర్మదపై కక్ష కట్టేస్తారు సేన.. ఇది ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని నర్మదా అంటుంది.. ఇక అమూల్య చాలా ఆవేశంగా ఇంటికి రావడం చూసిన శ్రీవల్లి ఈ విషయాన్ని నేను వెంటనే మా నాన్నకి చెప్పాలి అని అంటుంది.. అమూల్య ఆ విషయాన్ని గనుక చెప్తే కచ్చితంగా నా మీదకు వస్తుంది అని శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు ఎవరో ఒకరి చావును కోరుకుంటున్నావా.. ఈ విషయాన్ని ఇంట్లో చెప్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా నీకు అని శ్రీవల్లి అంటుంది. ఇక శ్రీవల్లి చెప్పిన మాటలు విని అమూల్య విశ్వం గురించి ఇంట్లో చెప్పడం ఆ మానేస్తుంది.. సేనాపతి రాత్రి తాగొచ్చి ఇంట్లో పెద్ద గొడవ చేస్తాడు. దీనిపై వేదవతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ధీరజ్ సేనాపతి పై కోపంగా ఉంటాడు.. ధీరజ్ ప్రేమ లోపలికి రాగానే మీ నాన్న కొంచెమైనా బుద్ధుందా? తాగేసి కూతురు వయసు అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడో చూసావా అని అంటాడు. అయితే ఇంకా విషయం గురించి వదిలేయ్ రా నీ ప్రేమ అంటుంది.. ప్రేమ ఎంత చెప్తున్నా కూడా ధీరజ్ పదేపదే ఆ విషయం చెప్పడంతో ప్రేమ సీరియస్ అయ్యి ఇద్దరు కొట్టుకుంటారు.. ఇక తర్వాత సేన అన్న మాటలను తలుచుకొని వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.. నర్మదా ఏంటి అత్తయ్య ఇంత పొద్దుకైనా కూడా మీరు ఇంకా పడుకోలేదు రండి.. పడుకుందురు అని అంటుంది.
నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడలని వేదవతి అంటుంది. ఏంటి చెప్పండి అత్తయ్య అనేసి నర్మద అంటుంది. నువ్వు ఆ ఇంటి విషయాల గురించి పట్టించుకోవద్దు. అది తప్పైనా సరే నువ్వు వాటి గురించి పెద్దగా పట్టించుకోవద్దు అని నర్మదతో వేదవతి అంటుంది. 25 ఏళ్ల నుంచి ఆ ఇంటి మధ్య రావణకాష్టం లాగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి.. నీవల్ల మళ్లీ అవి పెద్ద అవ్వకూడదు అని నర్మదాతో వేదవతి అంటుంది.. నేను కొత్తగా ఎవరితోనూ గొడవలు పెట్టుకోలేదు అత్తయ్య. నేను నా డ్యూటీ ని చేశాను తప్ప వేరే ఉద్దేశం లేదు అని నర్మదా అంటుంది.
వాళ్ల గురించి నీకు తెలియదు.. వాళ్ళు ఏదైనా అనుకుంటే కచ్చితంగా సాధించి చూస్తారు. నువ్వు వాళ్ళ జోలికి వెళ్లొద్దు నీ మంచికే చెప్తున్నాను అని వేదవతి అంటుంది.. అంత ధైర్యం లేని దాని అయితే నేను ఈ గవర్నమెంట్ జాబ్ చేసేదాన్ని కాదు అత్తయ్య. ఏమి పట్టించుకోకండి మీ వర్క్ ఇది రాదు నా డ్యూటీ నేను చేసుకుంటూ పోతాను అని నర్మదా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి మాటలు వింటున్న శ్రీవల్లి అమ్మ వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి ఈ గొడవలకు ఇంకా ఆజ్యం పోసి మరింత పెరిగేలా చేయాలి అని అనుకుంటుంది. ఇక వేదవతి ఏంటిది ఎంత చెప్పినా వినలేదు అని బాధపడుతూ ఉంటుంది.
ప్రేమ ఒంటరిగా ఉండడం చూసినా ధీరజ్ నన్ను పండ్లతో గట్టిగా గాట్లు పెట్టేసింది రేపు ఎల్లుండి వెళ్లి నేను ఇంజక్షన్ చేయించుకోవాలని ప్రేమ కోసం వెతుకుతూ వస్తాడు.. అయితే ప్రేమ మౌనంగా కూర్చుండడం చూసి నన్ను కొరికేసి నన్ను తిట్టేసి నువ్వేంటి ఇక్కడ మౌనంగా ఒంటరిగా కూర్చున్నావు అని అడుగుతాడు.. ప్రేమ ఏంటి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. చెయ్యి కొరికావు కదా ఇంకొక చెయ్యి కొరుకుతావేమో అని వెతుక్కుంటూ వచ్చాను అని ధీరజ్ అంటాడు.. సరే ఇక్కడ ఎందుకు కూర్చున్నావ్ పదా లోపలికి ఇక్కడ చలి దోమలు ఉన్నాయని అంటాడు..
నాకు ఇక్కడే బాగుంది నేను లోపలికి రాను నువ్వు వెళ్ళు అని ధీరజ్ తో ప్రేమ అంటుంది. లోపలికి వెళ్ళిన ధీరజ్ చాపా దిండు తీసుకొని బయటికి వస్తాడు. ఏంటి మళ్లీ బయటికి వచ్చావు అంటే నువ్వు మహారాణివి కదా నీ వాళ్ళు ఎవరైనా చూశారనుకో.. మా కూతుర్ని బయట ఒంటరిగా కూర్చోబెట్టావు. నువ్వు పెళ్లి చేసుకొని నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు అని నామీదకి యుద్ధానికి వస్తారు. ఎందుకమ్మా ముందు జాగ్రత్తగా నేను ఇక్కడే పడుకుంటే మంచిదే కదా అని ధీరజ్ అంటాడు.. వీడు నా మీద ప్రేమతో వచ్చాడు అనుకున్నాను మళ్ళీ మొదటికే వచ్చాడు వీడి సంగతి చెప్తాను అని ప్రేమ అంటుంది.
చాప మీద ధీరజ్ ని పక్కకు జరిపేసి ప్రేమ పడుకుంటుంది.. నువ్వు పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి అని ధీరజ్ అడుగుతాడు. నీకు నేను మహారాణి అని అన్నావు కదా నువ్వు నాకు కాపలా ఉండు ఎవరైనా వచ్చి నన్ను కిడ్నాప్ చేస్తారేమో అని ప్రేమ అంటుంది.. ఆనంద్ రావు భాగ్యం నడుచుకుంటూ వస్తుంటే అప్పులలు వెనకాల తరుముతారు దాంతో వాళ్ళు నాగేంద్ర హాజహు అంటూ పరిగెడతారు. ఊరంతా పరుగులు పెట్టించిన అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవాలని ఒకచోట దాక్కుంటారు..
Also Read : బాలు, మీనా మాటలతో షాక్.. ప్రభావతికి టెన్షన్ టెన్షన్.. సుశీల రాకతో హ్యాపీ..
మొత్తానికి వాలిద్దరూ తప్పించుకుంటారు.. మనము రామరాజు అన్న దగ్గరికి వెళ్లి దీనంగా మాకు ఎవరూ డబ్బులు ఇవ్వలేదు. కొత్త వ్యాపారానికి పెట్టుబడి కోసం వచ్చాము అని అడుగుదాం ఆయన మనకి సాయం చేస్తాడు అని భాగ్యం అంటుంది. ఇద్దరు కలిసి ప్రాక్టీస్ చేసి రామరాజు దగ్గరికి వెళ్తారు. అక్కడే బయట ఉన్న శ్రీవల్లి మీరేంటి ఇక్కడికి వచ్చారు అనగానే అప్పుల వాళ్ళు మమ్మల్ని తరిమేరు అని అసలు విషయాన్ని భాగ్యం చెప్తుంది.. రామ రాజు అన్నయ్య దగ్గరకొచ్చి డబ్బులు తీసుకోవాలని అనుకున్నాము అందుకే వచ్చాము అంటారు. ఆయన లేరు పక్కూరు కి వెళ్లారు అనగానే అయ్యో లేరా అయితే ఆయన వచ్చేవరకు ఇక్కడే సెట్లైపోదామని అనుకుంటారు. నర్మదా వేదవతి తో ఎంతగా మాట్లాడడానికి ప్రయత్నించినా సరే ఆమె మాట్లాడదు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..