Siva Jyothi: శివ జ్యోతి(Siva Jyothi) ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యాక్టివ్ గా ఉంటున్నారు. న్యూస్ రీడర్ గా యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శివ జ్యోతి బిగ్ బాస్(Bigg Boss) కంటెస్టట్టుగా కూడా పాల్గొని సందడి చేశారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలు ఇన్స్టాగ్రామ్ రీల్స్ అంటూ పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ఇకపోతే శివజ్యోతి దంపతులు త్వరలోనే తల్లితండ్రులుగా ప్రమోట్ అవ్వోబోతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల ఈమె తన ప్రెగ్నెన్సీ(Pregnancy) గురించి తెలియజేస్తూ ఘనంగా ఐదవ నెలలో సీమంతపు వేడుకలను కూడా జరుపుకున్నారు. ఇక శివ జ్యోతి నిత్యం తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈమె తన భర్త గంగూలీ(Ganguly)ను మరోసారి పెళ్లి చేసుకోవడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో పలు విమర్శలకు కూడా కారణం అవుతుంది. ఇప్పటికే వీరిద్దరూ రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు ముచ్చటగా మూడోసారి కూడా ఈ జంట పెళ్లి చేసుకోవడంతో పలు విమర్శలు ఎదురవుతున్నాయి.
శివ జ్యోతి గంగూలీ ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అనంతరం వీరి వివాహం జరిగి పది సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో రెండోసారి వివాహం జరుపుకున్నారు. తాజాగా మూడోసారి కూడా ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే శివ జ్యోతి ప్రెగ్నెంట్ గా ఉంటూ పెళ్లి చేసుకోవడంతో పలు విమర్శలు వస్తున్నాయి. అసలు వీళ్ళు ఎందుకు పెళ్లి చేసుకున్నారనే విషయానికి వస్తే.. శివ జ్యోతి ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమోషన్లలో భాగంగా గోయాస్ జువెలరీకి సంబంధించి ప్రమోషన్లను నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకున్నట్టు ఒక యాడ్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
?igsh=dWs5NWlrZ3p0anlj
ఇలా ప్రమోషన్లలో భాగంగా గర్భంతో ఉన్న ఈమె మరోసారి ఇలా పెళ్లి చేసుకున్న విధంగా నటించడంతో పలువురు ఈ వీడియో పై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. గర్భంతో ఉన్న వాళ్ళు ఇలా చేయకూడదు అటు కామెంట్లు చేయగా మరి కొంత మంది ఇప్పుడు కూడా ప్రమోషన్లను ఈ స్థాయిలో నిర్వహించాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఈమెకు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా శివ జ్యోతి ఇలా బేబీ బంప్ తో ఉంటూ మరోసారి తన భర్తతో కలిసి పెళ్లి పీటలు ఎక్కిన నేపథ్యంలో ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ జంట గత కొంతకాలంగా పిల్లల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు పెళ్లయిన పది సంవత్సరాలకు తల్లితండ్రులుగా మారబోతున్న నేపథ్యంలో శివ జ్యోతి కూడా కాస్త ఎమోషనల్ అవుతూ తన ప్రేగ్నెన్సీ విషయాన్ని రివీల్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Parineeti Chopra: పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన పరిణితి చోప్రా..పోస్ట్ వైరల్!