Malaika Arora: బాలీవుడ్ నటి మలైకా అరోరా (Malaika Arora) తన సినిమాల కంటే కూడా వ్యక్తిగత కారణాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా 50 ఏళ్ళ వయసులో కుర్ర హీరోలతో డేటింగ్ చేస్తూ వార్తల్లో నిలిచిన ఈమె.. ఇప్పుడు మరొకసారి కోరిక తీరాలి అంటే పెళ్లి అవసరం లేదు అంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.. మోడల్ గా కెరియర్ ఆరంభించి.. డాన్సర్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. నటిగా, టీవీ వ్యాఖ్యాతగా కూడా పేరు దక్కించుకుంది.
ఎక్కువగా హిందీ సినిమాలలో చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మలైకా.. 2008లో తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్ తో కలిసి అర్భాజ్ ఖాన్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా సల్మాన్ ఖాన్ (Salman Khan) ప్రధాన పాత్రలో దబాంగ్ సినిమా నిర్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే 50 ఏళ్ల వయసులో కూడా ఫిట్నెస్, ఫ్యాషన్ బ్యూటీ పరంగా ఎప్పటికప్పుడు స్పాట్ లైట్ లో నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఊహించని కామెంట్లు చేసింది.
ఇంటర్వ్యూలో భాగంగా మలైకా అరోరాకు వ్యక్తిగత జీవితం, సంబంధాల గురించి ప్రశ్న ఎదురవగా.. ఎవరు ఊహించని సమాధానం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. మలైకా అరోరా మాట్లాడుతూ..” ప్రతి వ్యక్తికి కూడా తన జీవితాన్ని తమ ఇష్టానుసారంగా గడిపే హక్కు ఉంది. మనసుకు నచ్చిన వ్యక్తితో శృంగారం చేయడంలో తప్పేముంది. దానికి పెళ్లి కావాల్సిన అవసరం అంతకంటే లేదు.. ఇక్కడ స్వేచ్ఛగా జీవించడమే ముఖ్యం” అంటూ ఊహించని కామెంట్ చేసింది.
ALSO READ:Vishnu Vishal: నా సినిమాకి 21 మంది నిర్మాతలు మారారు.. అసలు విషయం చెప్పిన హీరో!
ఇకపోతే ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మలైకా పై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇకపోతే కొంతమంది మలైకాది వ్యక్తిగత స్వేచ్ఛగా చూస్తుండగా.. ఇంకొంతమంది ఇలాంటి వ్యాఖ్యలు పబ్లిక్ గా చేయడం తగదు. మీలాంటి సెలబ్రిటీలను చూసుకొని యువత పక్కదోవ పడుతున్నారు అంటూ మండిపడుతున్నారు. అంతేకాదు ఇలాంటి మెసేజ్ ల వల్ల సమాజానికి ఎంత నష్టం వాటిల్లుతుందో ఒకసారి గమనించారా అంటూ మలైకాపై మండిపడుతూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.
ఇదిలా ఉండగా మలైకా అరోరా తన భర్త నుంచి విడిపోయిన తర్వాత తనకంటే 13 సంవత్సరాలు వయసులో చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ లో ఉన్న ఈమె… అనూహ్యంగా విడిపోయింది. అయితే విడిపోయిన తర్వాత మళ్లీ ఎక్కడా కనిపించలేదు. కానీ ఇటీవల దివాలి ఈవెంట్ లో భాగంగా ఇద్దరూ ఒకేసారి ఎదురుపడగా ఆప్యాయంగా హగ్ చేసుకుని అందరిని ఆశ్చర్యపరిచారు. విడిపోయిన సరే స్నేహపూర్వకంగానే విడిపోయినట్లు అందరికీ స్పష్టం చేశారు. ఇక మొత్తానికైతే మలైకా అరోరా ఇలా వ్యక్తిగత కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తోంది అని చెప్పవచ్చు. మలైకా అరోరా విషయానికి వస్తే.. ఇక ఈమధ్య నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ గ్లామర్ ఫోటోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. 50 సంవత్సరాల వయసులో కూడా ఫిట్ గా ఉంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ ముద్దుగుమ్మ.