E-Paper
Advertisement

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన

వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన
Advertisement

Congo: వివాహ వేడుకలో కాస్త విషాదంగా మారింది. ఒక్కసారిగా అగ్నిప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో దాదాపు 22 మంది వరకు మృత్యువాత పడ్డారు. ఘటన గురించి తెలియగానే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ ఘటన కాంగోలో చోటు చేసుకుంది.

కాంగో రాజధాని కిన్షాసాలో ఘోరం

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్షాసాలోని ఓ వివాహ వేదిక వద్ద ఆదివారం ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 22 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. లింగువాలా కమ్యూన్‌ ప్రాంతంలోని ఓ హాల్‌లో పెళ్లి వేడుక జరుగుతుండగా అగ్నిప్రమాదం సంభవించిందింది. 22 మంది చనిపోయారని, ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని లింగ్వాలా మేయర్ తెలిపారు. భవనంలో ఆస్తి నష్టం కూడా జరిగిందని, హాలు దాదాపు ధ్వంసమైందన్నారు.

వివాహంలో అగ్నిప్రమాదం.. 22 మంది మృతి

Advertisement

గాయపడిన పలువురిని చికిత్స కోసం కిన్షాసాలో ఉన్న పలు ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. అగ్నిప్రమాదం జరిగిన తర్వాత పెళ్లికి హాజరైనవారు సురక్షిత వారి ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు ప్రయత్నించారు. భవనంలోని ఇరుకైన దారులు, సందుల్లో పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు కష్టసాధ్యంగా మారింది. ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. ప్రమాదం తర్వాత కొంతమంది రోడ్డు పక్కన పడినట్టు కనిపించారు. వీరిలో కొందరు ప్రాణాలతో ఉండగా, మరికొందరు మరణించారు. అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా ధృవీకరించలేదు.

ALSO READ: ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

Advertisement

కాంగో ఉప ప్రధాని, అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ షబానీ ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ ఘటనను ఒక విషాదకరమైనదిగా అభివర్ణించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు తర్వాత మృతులు, గాయపడిన వారి సంఖ్య చెబుతామన్నారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. కిన్షాసాలోని జనసాంద్రత అధికం. ఆ ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి. నగరంలో వేగంగా జరుగుతున్న పట్టణాభివృద్ధి కారణంగా అత్యవసర సౌకర్యాలు కొరవడ్డాయి. ఈ ఏడాది వేసవి కాలంలో అనేక అగ్నిప్రమాదాలు జరిగాయని స్థానిక మీడియా నివేదించింది.

Related News

ఆఫ్రికా పెరిగింది, అమెరికా అలిగింది.. కొత్త ప్రపంచ పటానికి UN ఆమోదం

నేపాల్‌పై ప్రకృతి కన్నెర్ర.. భారీగా విరిగిన కొండచరియలు, నది ప్రవాహానికి అంతరాయం

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

Big Stories

Advertisement
×