Intinti Ramayanam Today Episode September 6th : అందరూ అంతగా ఏడుస్తున్నాడు అని చూసిన డాక్టర్ ఇక్కడ వేరే పేషెంట్ కూడా ఉన్నారు ఒక మనిషి చనిపోయాడు అని అనుకుంటే రేపు మా పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది అని బాధ పడిపోతారు. మీరు వెంటనే ఇక్కడి నుంచి తీసుకొని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించండి అని డాక్టర్ చెప్తాడు. ఇక రాజేంద్ర ప్రసాద్ ని తీసుకొని వెళ్లి ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆయన అంత్యక్రియలు నిర్వహించాలి అని అక్షయ్ అంటాడు. అక్షయ్అంత్యక్రియలు నిర్వహించేస్తారు. తండ్రి చివరి చూపు కూడా తన తల్లి చూడలేదు అని అందరూ చాలా బాధపడిపోతూ ఉంటారు. రాజేంద్రప్రసాద్ తో ఉన్న బాండింగ్ గురించి ఒకసారి గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటారు.
రాజేంద్రప్రసాద్ కాలిపోతున్నాడు అని చాలా ఎమోషనల్ అవుతారు. ముగ్గురు అన్నదమ్ములు కూడా తన తండ్రితో గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తుచేసుకొని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటారు.. ఇక కమల్ తన తండ్రి చనిపోయాడు తల్లి పరిస్థితి ఎలా ఉంటుందో అని బాధ పడిపోతూ ఉంటాడు. అసలు తన తల్లికి ఎలా చెప్పాలి. ఆమె పరిస్థితి ఎలా మారుతుంది అని బాధ పడిపోతూ ఉంటాడు. పల్లవి మాత్రం రాజేంద్రప్రసాద్ చనిపోయాడని చాలా ఆనందంగా ఉంటుంది.
కన్న తండ్రి చనిపోయాడు అని అందరూ బాధపడిపోతూ ఉంటారు. కానీ కన్న తండ్రి ఇన్నేళ్లు తమతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఒక్కొక్కరు కాలే కట్టితో బాధని చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు. అసలు మా నాన్న చనిపోతాడు అని అస్సలు ఊహించలేదు అని అక్షయ్ కుమిలి కుమిలి ఏడుస్తాడు.. అందరూ కూడా తండ్రికి తలకరి పెట్టి కాలిపోతున్న చిట్టి దగ్గర కన్నీళ్లు పెట్టుకొని తల్లికి ఏం చెప్పాలి అని బాధపడిపోతూ ఉంటారు. ఇక శ్రీయ అవని ఇద్దరు కూడా మామయ్య చనిపోయారు అని చాలా బాధపడిపోతూ ఉంటారు. ఈ క్రమంలో పల్లవి మాత్రం ఈ ముసలోల చచ్చాడు కాబట్టి నేను సేఫ్ దేవుడు నాకు ఎప్పుడు ఇలా ఫెవర్ గాని చేస్తూ ఉంటాడు అని చాలా సంతోషంగా ఉంటుంది. నన్ను దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు ఈ ముసలోళ్ళు చచ్చాడు కాబట్టి నాకు ఎటువంటి టెన్షన్ లేదు అని పల్లవి సంతోషంగా నవ్వుకుంటూ ఉంటుంది.
భానుమతి తన కొడుకు వస్తున్నాడు అని చాలా సంతోషంగా ఉంటుంది. తన కొడుకుతో ఎప్పుడు మాట్లాడదామని సంతోషంగా వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్లకి చెప్తే పలు చాలా బాధపడిపోతారు అని భానుమతికి కూడా నిజం చెప్పకుండా దాచి పెట్టాలని అనుకుంటారు. ఏంటి మీరంతా అలా అన్నారు ఎవరు చనిపోయినట్టు ఎవరైనా చనిపోయారా అని అడుగుతుంది. భానుమతి కి నిజంగానే అనుమానం మొదలైందేమో అని అందరూ కంగారు పడిపోతూ ఉంటారు. అవని మాత్రం అదేమీ లేదు అమ్మమ్మ గారు ఎవరికీ ఏమీ కాలేదు అని అబద్ధం చెప్తుంది. కానీ భానుమతికి మాత్రం అనుమానం ఇంకాస్త పెరుగుతుంది.. ఎందుకు అందరూ బాధపడుతున్నట్లు కనిపిస్తున్నారు ఏమైంది అని భానుమతి ఎంత అడిగినా సరే ఎవరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలిచిన చూస్తూ ఉండిపోతారు. పల్లవి మాత్రం ఇంట్లో ఈ విషయం తెలిస్తే అందరూ చచ్చిపోతారు నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటుంది..
పార్వతి ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఏమైనా జరిగిందా? ఎవరికైనా ఏదైనా అయదా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. పార్వతి ఏమైంది మీరందరూ ఎందుకు ఇలా ఉన్నారు? ఏమైనా జరిగిందా? ఎవరికైనా ఏదైనా అయిందా అంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. తన తల్లికి నిజం తెలిస్తే తట్టుకోలేదు తండ్రిని కోల్పోయిన మాకు తల్లి కూడా మిగలదు అని అందరూ చాలా బాధపడిపోతూ ఉంటారు. పార్వతి ఆ మాట అడగగానే కమల్ కన్నీళ్లు పెట్టుకుంటూ తల్లి కాళ్లు పట్టుకుంటాడు. ఏమైంది కమల్ ఎందుకు అలా అన్నావ్ ఏం జరిగింది? మీ నాన్నని తీసుకొని వస్తారని వెళ్లారు కదా మరి అందరూ ఊరికే వచ్చారు ఎక్కడ మీ నాన్న ఎప్పుడు వస్తాడు ఇవాళ వస్తాడా లేదా అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే భానుమతికి కూడా అనుమానం రావడంతో కమల్ నిజం చెప్పబోతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read : నర్మద పెళ్లి చేసుకోబోతుందా..? అబ్బాయి ఎవరంటే..?