E-Paper
Advertisement

ఆస్ట్రేలియా వీసా కావాలా? భారతీయులకు నేటి నుంచి రూల్స్, ఆ రెండు చేయాల్సిందే

ఆస్ట్రేలియా వీసా కావాలా? భారతీయులకు నేటి నుంచి రూల్స్, ఆ రెండు చేయాల్సిందే
Advertisement

Australia visa New Rules: భారత్ నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఇకపై కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. భారతీయులు వేలిముద్రలు, ముఖ చిత్రాలను ఇవాల్సి వుంటుంది. వీసా కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారికి వర్తిస్తాయి. ప్రకటన ముందు అప్లై చేసుకున్నవారికి కొత్త రూల్స్ ప్రభావం పడదని భారత్ లోని ఆస్ట్రేలియా హైకమిషన్ ప్రకటించింది.

ఆస్ట్రేలియా వీసాకు అప్లై చేస్తున్నారా?

భారతీయ విద్యార్థులు, ఉద్యోగులు, పర్యాటకులకు ఆస్ట్రేలియా వెళ్లాలనుకునే వారికి ముఖ్య గమనిక. ఆస్ట్రేలియా ప్రభుత్వం వీసా దరఖాస్తుల ప్రక్రియలో పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. వీసా వ్యవస్థను సురక్షితంగా, పటిష్ఠంగా మార్చే లక్ష్యంతో భారత్‌లోని దరఖాస్తుదారులు బయో మెట్రిక్ వివరాల సేకరణను తప్పనిసరి చేసింది. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 26 అనగా సోమవారం నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు వేలిముద్రలు, ఫేషియల్ ఇమేజ్ ఇవ్వాలి.

భారతీయులకు నేటి నుంచి రూల్స్

Advertisement

దీనిపై దరఖాస్తుదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీలోని ఆస్ట్రేలియా హైకమిషన్ తెలియజేసింది. బయోమెట్రిక్ అందించాల్సిన అవసరం ఉన్నవారికి ఆస్ట్రేలియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారికంగా ఈ-మెయిల్ ద్వారా సమాచారం వస్తుందని తెలిపింది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా 16 వీఎఫ్ఎస్ గ్లోబల్ కేంద్రాలకు వెళ్లి తమ బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అర్హులైన వ్యక్తులు ఆస్ట్రేలియన్ ఇమ్మి యాప్ ద్వారా పూర్తి చేయవచ్చు. దీనివల్ల గుర్తింపు మోసాలను అరికట్టడం, చట్టబద్ధమైన దరఖాస్తుదారుల వివరాలకు భద్రత కల్పించడం ప్రధాన ఉద్దేశం.

ALSO READ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త హెచ్చరిక.. ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తాం, ఈ రోజు నుంచే మొదలు

Advertisement

వలస వ్యవస్థ సమగ్రతను కాపాడటం ముఖ్యమని అందులో తెలిపింది. బయోమెట్రిక్ సేకరణ వల్ల వీసా ప్రాసెసింగ్ సమయంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని ప్రస్తావించింది. దరఖాస్తుదారులు ఈ-మెయిల్ అందిన వెంటనే ఆలస్యం చేయకుండా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. అధికారిక సమాచారం లేకుండా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవద్దని స్పష్టం చేసింది. దాదాపు 60 దేశాల్లో బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తోంది ఆస్ట్రేలియా. ఈ జాబితాలోకి భారత్‌ను చేర్చింది. దరఖాస్తుదారుల నుంచి సేకరించిన సమాచారాన్ని ఆస్ట్రేలియా- భారత చట్టాలకు అనుగుణంగా భద్రం, ఎన్‌క్రిప్టెడ్ పద్ధతిలో నిర్వహిస్తామని హామీ ఇచ్చింది కూడా.

ఆస్ట్రేలియాలో భారత సంతతివారు రెండో అతిపెద్ద ప్రవాసీయులు ఉన్నారు. 2021 జనాభా లెక్కల ప్రకారం.. అక్కడ దాదాపు 9.76 లక్షల మంది భారతీయులు ఉంటున్నారు. లక్షలాది మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విషయం తెల్సిందే.

Related News

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త హెచ్చరిక.. ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తాం, ఈ రోజు నుంచే మొదలు

మాల్దీవులు-పాకిస్తాన్ దోస్తీ.. భారత్‌పై దీని ప్రభావం ఎంత?

గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం!

కెన్యాలో కుప్పకూలిన 12 అంతస్తుల భారీ భవనం.. శిథిలాల కింద కూలీలు?

మరో ‘ఎపిక్ ఫ్యూరీ’కి సిద్ధం.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

ఖమేనీ బతికే ఉన్నారా? ఇరాన్‌ను నడిపిస్తోంది ఎవరు? సంచలన నిజాలు బయటపెట్టిన దౌత్యవేత్త!

ఐరాసలో పాకిస్థాన్‌కు గట్టి షాక్.. కార్గిల్ వార్ నిజాలు బయటపెట్టి తోలుతీసిన భారత్!

Big Stories

Advertisement
×