E-Paper
Advertisement

ఏందయ్యా స్వామి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. విరోష్ కెమిస్ట్రీ అదుర్స్!

ఏందయ్యా స్వామి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. విరోష్ కెమిస్ట్రీ అదుర్స్!
Advertisement

Endhayya Sami Song: విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తాజాగా నటించిన చిత్రం రణబాలి (Ranabaali). రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో సుమారు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ పాలనలో రాయలసీమ ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వారు పడిన కష్టాల గురించి తెలియజేస్తూ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ రణబాలి అనే పాత్రలో నటించారు. ఇక ఈ పాత్ర అప్పట్లో రాయలసీమను ఏలుతున్న పాలేగాళ్ళ ఆధారంగా రూపొందించినట్లు డైరెక్టర్ రాహుల్ తెలిపారు. ఇలా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ట్రెండింగ్ లో ఏందయ్యా సామి..

ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా రణబాలి నుంచి ఏందయ్యా సామి పాట విడుదల చేయగా ఈ పాటకు విపరీతమైన క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరూ రష్మిక లుక్ రిక్రియేట్ చేయడమే కాకుండా పెద్ద ఎత్తున రీల్స్ చేస్తూ సందడి చేశారు ఇక థియేటర్లలో కూడా ఈ పాటకు విపరీతమైన క్రేజ్ లభించిన సంగతి తెలిసిందే. ఇలా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న ఏందయ్యా సామి(Endhayaa Saami) పాటకు సంబంధించి ఫుల్ వీడియోని మేకర్స్ విడుదల చేయగా ప్రస్తుతం ఈ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది.

పెళ్లి తర్వాత మొదటి సినిమా..

Advertisement

ఏందయ్యా సామి ఫుల్ వీడియో సాంగ్ విడుదల కావడంతో ఈ పాట చూసిన నెటిజన్స్ సాంగ్ చాలా అద్భుతంగా ఉందని విరోష్ కెమిస్ట్రీ వేరే లెవెల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏందయ్య సామి లిరికల్ సాంగ్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. మరి ఈ పాట వీడియో సాంగ్ ఎలాంటి ఆదరణ పొందుతుందో తెలియాల్సి ఉంది. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్నకు(Rashmika Mandanna) రణబాలి సినిమా మూడో సినిమా కావటం విశేషం ఇది వరకు వీరి కాంబినేషన్లో వచ్చిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ జంట మరోసారి రణబాలి సినిమా ద్వారా వెండి తెరపై సందడి చేశారు.

Advertisement

ఇకపోతే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి తర్వాత నటించిన మొదటి సినిమా కావటం విశేషం. డియర్ కామ్రేడ్ సమయంలో ప్రేమలో పడిన ఈ జంట రణబాలి సినిమా సమయంలో వివాహం చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత విజయ్ రష్మిక నటించిన మొదటి సినిమా కావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో ఆదరణ లభించింది. ఇకపోతే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ రష్మిక విడాకులకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి. ఇలా విడాకులు వార్తలు రావడంతో విరోష్ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ విడాకుల రూమర్లపై రష్మిక ఘాటుగా స్పందిస్తూ ఈ పుకార్లకు చెక్ పెట్టారు.

Also Read: కాబోయే భార్య ఇలాగే ఉండాలి…ఆ హీరోయిన్ లాగా ఉండాలంటూ!

Related News

విజయ్ పై భారీ ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రష్మిక!

ఏంటీ.. ఆదర్శ కుటుంబం మూవీలో వెంకటేష్ దొంగా? సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే?

ప్రాణభయంతో సొంత ఇంటిని అమ్మేసిన టైగర్ ష్రాఫ్.. ఎన్ని కోట్లంటే?

చిక్కుల్లో ఫౌజీ సినిమా.. నేతాజీ మనవడు ఏమన్నారంటే?

తెలుగు డబ్బింగ్ కి సిద్ధమైన ఒడిస్సా హిట్ మూవీ..ఏదో తెలుసా?

ఘెట్టో కిడ్స్ తో భాగ్య శ్రీ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అదుర్స్.. వీడియో వైరల్!

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు..

Big Stories

Advertisement
×