Upcoming Cars Under Rs 10 Lakh in India: దేశంలో బడ్జెట్ కార్లకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు, మెరుగైన భద్రత, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో కూడిన కార్లను కొనుగోలు చేయాలని చాలామంది భావిస్తారు. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల లోపు ధరతో లభించే కార్లు, త్వరలో మార్కెట్లోకి రానున్న కొత్త మోడళ్లపై ఆసక్తి పెరుగుతోంది. కాంపాక్ట్ SUVలు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఎలక్ట్రిక్ కార్లు ఈ విభాగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
విన్‌ఫాస్ట్ VF3 EV చిన్న సైజులో ఉండే ఎలక్ట్రిక్ వెహికల్. ముఖ్యంగా సిటీలో ప్రయాణించే వారికి అనువుగా దీన్ని రూపొందించారు. కాంపాక్ట్ డిజైన్ కారణంగా రద్దీగా ఉండే రోడ్లపై నడపడం, పార్కింగ్ చేయడం సులభంగా ఉండే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.10 లక్షలు. అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఈ మోడల్ బాగుంటుంది.
హ్యుందాయ్ నుంచి HE1i కాంపాక్ట్ EV కూడా రాబోతోంది. సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండే ధరలో ఎలక్ట్రిక్ కారును తీసుకురావడమే లక్ష్యంగా దీనిని తీసుకొస్తున్నారు. దీని అంచనా ధర రూ.10 లక్షలు కాగా.. నవంబర్ 15న విడుదల కానుంది.
రెనాల్ట్ బ్రిడ్జర్ చిన్న SUVల విభాగంలోకి రానున్న మోడల్. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, కాంపాక్ట్ బాడీతో పట్టణ ప్రయాణాలతో పాటు సాధారణ రోడ్లపై కూడా ఉపయోగపడేలా ఉంటుంది. దీని ధర సుమారు రూ.7 లక్షలుగా చెబుతున్నారు. ఏప్రిల్ 10, 2027న విడుదల కానుంది.
వోక్స్ వ్యాగన్ కూడా రూ.10 లక్షల లోపు సెగ్మెంట్ లో కాంపాక్ట్ SUVను తీసుకురావచ్చని సమాచారం. యూరోపియన్ డిజైన్, నిర్మాణ నాణ్యతపై ఆసక్తి ఉన్న కొనుగోలుదారులను ఈ మోడల్ ఆకట్టుకునే అవకాశం ఉంది. దీని అంచనా ధర రూ.7.70 లక్షలు కాగా, మే 15, 2027లో విడుదల కానుంది.
టాటా ఏరిస్ రూ.5.30 లక్షల నుంచి రూ.9.75 లక్షల వరకు ధరలో లభించనుంది. డాష్‌క్యామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అయితే, మోడల్ పేరు, ఫీచర్లు, ధరలను కంపెనీ అధికారికంగా ప్రకటించనుంది.
టాటా పంచ్ EV మైక్రో-SUV విభాగంలో ఎలక్ట్రిక్ వాహనం కోరుకునే వారికి బెస్ట్ ఆప్షన్ కానుంది. దీని ధర రూ.9.79 లక్షల నుంచి రూ.12.99 లక్షల వరకు ఉంటుంది. బేస్ వేరియంట్ ధర రూ.10 లక్షల వరకు ఉంటుంది. బడ్జెట్‌లో EV కొనాలనుకునేవారు ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ కానుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 350 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది.
Read Also: మహీంద్రా థార్ E To హ్యుందాయ్ ఇన్‌స్టర్.. నవంబర్ లో ఎంట్రీ ఇవ్వనున్నక్రేజీ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!