E-Paper
Advertisement

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త హెచ్చరిక.. ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తాం, ఈ రోజు నుంచే మొదలు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త హెచ్చరిక.. ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తాం, ఈ రోజు నుంచే మొదలు
Advertisement

Trump: ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం కొత్త మలుపు తిరగనుందా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికల వెనుక ఏం జరిగింది? ఆదివారం నుంచి ఇరాన్‌పై కొత్తగా దాడులు అమెరికా-ఇజ్రాయెల్ కలిసి దాడులు చేయబోతున్నాయా? అదే జరిగితే మళ్లీ మార్కెట్లు పతనం కానున్నాయా? ఆయిల్ ధరలు పెరగడమే దీనికి సాకు చెబుతోంది అమెరికా.

ట్రంప్ కొత్త హెచ్చరిక.. ఈ రోజు నుంచి ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తాం

ఇరాన్‌పై మరిన్ని సైనిక దాడులు జరిపే అవకాశం ఉందని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు దౌత్యపరమైన ఒప్పందానికి అవకాశం ఉందని ఇదే సందర్భంగా ప్రస్తావించారు. ఫ్లోరిడాలో తన ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. సైనిక చర్య ఒక ప్రత్యామ్నాయంగా ఉందన్నారు. ఇరాన్ ఒప్పందానికి రావచ్చునని సూచించారు. ఒప్పందం జరగకుండే పరిస్థితి ఏంటన్న దానిపై నోరు విప్పారు.  దాడి బహుశా రేపు అంటే ఆదివారం జరగవచ్చని సూచనప్రాయంగా చెప్పారు. శాంతి ఒప్పందంపై టెహ్రాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు.

చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణమా?

Advertisement

ఒకవేళ ఆ దేశం.. తమ డిమాండ్లను అంగీకరించకపోతే సైనిక చర్య ఉండవచ్చని హెచ్చరించారు. ఇరాన్‌తో ఆదివారం అద్భుతమైన ఒప్పందం కుదరొచ్చు లేదా దాడులైనా జరగొచ్చని క్లారిటీ ఇచ్చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధర బ్యారెల్‌కు 116 డాలర్లకు పెరిగింది. అమెరికా-ఇరాన్ ఘర్షణ ఉధృతంగా ఉన్న ఏప్రిల్ చివరినాటికి బ్రెంట్ ధర 126 డాలర్ల గరిష్ఠ స్థాయికి చేరింది.  ఇప్పుడు చమురు ధరలు ఆ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తాజా హెచ్చరిక వచ్చింది. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆ లక్ష్యాన్ని సాధించడానికి సైనిక చర్యలు చేపట్టాల్సి వచ్చినా వెనుకాడబోమన్నారు.

దాడులు ఎప్పుడు చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. నవంబర్‌లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇరాన్‌పై దాడులు జరపకపోవచ్చని ప్రభుత్వ వర్గాల మాట. ఎన్నికల తర్వాత ఇజ్రాయెల్‌తో కలిసి మళ్లీ పెద్ద ఎత్తున విరుచుకుపడే అవకాశం ఉన్నట్లు చెబుతున్నాయి. అగ్రరాజ్యం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందోనని గల్ఫ్ దేశాల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. వాషింగ్టన్ తన నావికా దిగ్బంధనాన్ని ఎత్తివేయడానికి బదులుగా హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఒక ఒప్పందం ప్రతిపాదించబడుతుందన్న వార్తలను టెహ్రాన్ తీవ్రంగా ఖండించింది.

Advertisement

ALSO READ: మాల్దీవులు-పాకిస్తాన్ దోస్తీ.. భారత్‌పై దీని ప్రభావం ఎంత?

Related News

మాల్దీవులు-పాకిస్తాన్ దోస్తీ.. భారత్‌పై దీని ప్రభావం ఎంత?

గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం!

కెన్యాలో కుప్పకూలిన 12 అంతస్తుల భారీ భవనం.. శిథిలాల కింద కూలీలు?

మరో ‘ఎపిక్ ఫ్యూరీ’కి సిద్ధం.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

ఖమేనీ బతికే ఉన్నారా? ఇరాన్‌ను నడిపిస్తోంది ఎవరు? సంచలన నిజాలు బయటపెట్టిన దౌత్యవేత్త!

ఐరాసలో పాకిస్థాన్‌కు గట్టి షాక్.. కార్గిల్ వార్ నిజాలు బయటపెట్టి తోలుతీసిన భారత్!

ట్రంప్ అల్లుడిపై సంచలన ఆరోపణలు.. యావత్ ప్రపంచమే షాక్.. ఈయన మామూలోడు కాదు!

Big Stories

Advertisement
×