BigTV English

China: లోదుస్తుల యాడ్స్ అమ్మాయిలు చేయొద్దనే సరికి.. ఏం చేశారంటే?

China: లోదుస్తుల యాడ్స్ అమ్మాయిలు చేయొద్దనే సరికి.. ఏం చేశారంటే?

China: వ్యాపారంలో లాభాలు రావాలంటే ముందు మన బిజినెస్ జనాల్లోకి వెళ్లాలి. అందుకే వ్యాపారస్తులు మోడల్స్, హీరోయిన్లతో ప్రకటనలు ఇస్తుంటారు. ఆన్‌లైన్‌లో, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. ముఖ్యంగా అందమైన అమ్మాయిలు, హీరోయిన్లతో ఇటువంటి ప్రకటనలు ఎక్కువగా చేయిస్తుంటారు.


అయితే ఇటీవల చైనా ఆన్‌లైన్‌లో లోదుస్తుల యాడ్స్ అమ్మాయిలు చేయకుండా నిషేధం విధించింది. దీంతో అక్కడి వ్యాపారస్తులు కొత్త పంథాను ఎంచుకొని యాడ్స్ ఇస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

సాధారణంగా లోదుస్తుల యాడ్స్‌లో అమ్మాయిలే ఎక్కువగా కనిపిస్తారు. అయితే ఈ యాడ్స్ వల్ల అశ్లీలత పెచ్చుమీరుతుందని చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అమ్మాయిలు లోదస్తుల యాడ్స్ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ చేస్తే సదరు వ్యాపారస్తుడి మీద అమ్మాయిమీద చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈమేరకు ప్రత్యేక చట్టాన్నే తీసుకొచ్చింది.


అయితే ఇలా చేయడం వల్ల బ్రాండ్ ప్రమోషన్స్ తగ్గిపోయి వ్యాపారాలు నష్టాల్లోకి జారుకున్నాయి. వ్యాపారస్థులు తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈక్రమంలో ఓ వ్యాపారవేత్త కొత్తగా థింక్ చేశాడు. వెంటనే దానిని ఆచరణలో పెట్టాడు. దీంతో వ్యాపారం మళ్లీ గాడిలో పడింది. నష్టాల నుంచి మళ్లీ లాభాల్లోకి వచ్చాడు. అది చూసిన మిగతా వ్యాపారులుకూడా దాన్నే ఫాలో అవడం మొదలు పెట్టారు.

ఇంతకీ అతను ఏం చేశాడంటే అమ్మాయిలకు బదులుగా.. అబ్బాయిలకు లోదుస్తులు వేయించి వారితో ప్రమోషన్స్ చేయించాడు. వీడియోలు, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో, ఇంటర్నెట్‌లో మార్కెటింగ్ చేశాడు. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. అయితే ఇదేదో వర్క్ అవుట్ అవుతుందనుకున్న వ్యాపారస్థులు.. వారు కూడా ఇలానే చేయడం మొదటు పెట్టారు. అబ్బాయిలతో లోదుస్తులు వేయించి మార్కెటింగ్ చేయించడం స్టార్ట్ చేశారు.

ప్రస్తుతం వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ దస్తులు అమ్మాయిలకంటే.. అబ్బాయిలు వేసుకుంటేనే బాగుంది అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×