E-Paper
Advertisement

భారత సంతతికి చెందిన వ్యక్తి చేతిలో ఉబెర్ డ్రైవర్ మృతి..అమెరికాలో షాకింగ్ ఘటన

భారత సంతతికి చెందిన వ్యక్తి చేతిలో ఉబెర్ డ్రైవర్ మృతి..అమెరికాలో షాకింగ్ ఘటన
Advertisement

Ameirca: అమెరికాలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ ప్రయాణికుడి చేతిలో దాడికి గురైన.. ఉబర్ డ్రైవర్ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. దాడికి సంబంధించి 25 ఏళ్ల సమిత్ అపూర్వ పటేల్‌పై హత్యాయత్నం వంటి అభియోగాలు మోపారు అక్కడి పోలీసులు. ఘటన ఎలా జరిగింది?

అమెరికాలో దారుణమైన ఘటన

ఈ ఘటన వెనుక వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం. ఈనెల 14న మొహమ్మద్ యూసుఫ్ తన కారులో ప్రయాణికుడ్ని ఎక్కించుకున్నాడు. ప్రయాణికుడు 25 ఏళ్ల వయస్సు గల సమిత్ అపూర్వ పటేల్‌. భారత సంతతికి చెందిన వ్యక్తి కూడా. కారులో కొంత దూరం వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త తారాస్థాయికి చేరంది. ఈ క్రమంలో యూసుఫ్ మెడకు సీటు బెల్టు బిగించి అతడి కారుతో తొక్కించేశాడు.

Advertisement

ఘటన తర్వాత అక్కడి నుంచి సమిత్ పరారయ్యాడు. ఈ ప్రమాదంలో యూసుఫ్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. దాడికి పాల్పడిన వ్యక్తి 25 ఏళ్ల సమిత్ అపూర్వ పటేల్‌ గా గుర్తించారు. ఆ తర్వాత పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. తొలుత హత్యాయత్నం కింద అభియోగాలు మోపారు. బాధితుడు యూసుఫ్ మరణించడంతో నిందితుడిపై సెకండ్ డిగ్రీ ఉద్దేశపూర్వక హత్య కేసుగా అభియోగాలను మార్చారు హెన్నెపిన్ కౌంటీ అటార్నీ మేరీ మోరియార్టీ.

భారత సంతతికి చెందిన వ్యక్తి చేతిలో ఉబెర్ డ్రైవర్ మృతి

ఘటన జరిగిన సమయంలో యూసుఫ్ తన సోదరుడితో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. తనను సీటు బెల్టుతో ఉరి వేస్తున్నారని, కారుతో తొక్కిస్తున్నారని యూసుఫ్.. సోమాలి భాషలో అరవడం వినిపించిందని తెలిపారు. ఈ దాడి జాత్యహంకార కోణంలో జరిగిందని నిరూపించడానికి తగిన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్ చెబుతున్నారు. ఈ ఘటన తర్వాత అమెరికాలో అతిపెద్ద సోమాలి జనాభా ఉన్న మిన్నెసోటా. వీరిలో చాలామంది మిన్నియాపాలిస్-సెయింట్ పాల్ ప్రాంతంలో ఉంటున్నారు.

Advertisement

వీరిలో అత్యధికులు అమెరికా పౌరులే. 1993లో అమెరికాకు వలస వచ్చిన యూసుఫ్‌. ఆయనకు ఐదుగురు పిల్లలు ఉన్నారు. మరణానికి ముందు ఐదు సర్జరీలు జరిగినట్టు ఆయన కొడుకు ముస్తఫా తెలిపాడు. ఈ విషాదకరమైన ఘటనపై పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాడని ఆయన న్యాయవాది కేథరీన్ టర్నర్ ఈ-మెయిల్‌లో ప్రస్తావించారు. ఈ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నందున, దీనిపై తుది తీర్పు ఇవ్వవద్దని ఆయన కోరారు. .

ALSO READ: చిగురుటాకులా వణికిపోయిన అమెరికా.. లాస్‌ ఏంజెల్స్‌లో భారీ భూకంపం! ప్రాణభయంతో పరుగులు!

Related News

చిగురుటాకులా వణికిపోయిన అమెరికా.. లాస్‌ ఏంజెల్స్‌లో భారీ భూకంపం! ప్రాణభయంతో పరుగులు!

ట్రంప్ కేబినెట్‌లో జంకుతున్న సీనియర్ మినిస్టర్స్.. ఎందుకో తెలుసా..?

అంతరిక్షంలో అణుబాంబు పేల్చేందుకు రష్యా వ్యూహం.. ఇక ప్రపంచానికి ముప్పు తప్పదా..?

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు.. ఏడుగురు విద్యార్థుల మృతి, 97 మందికి గాయాలు

ఏఐతో బాంబు తయారీ.. ఆ తర్వాత భారీ భవనం పేలుడుకి కుట్ర, అధికారుల అదుపులో టీనేజర్

ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. మంటలు ఎగిసిపడడంతో 31 మంది సజీవ దహనం, ఈజిప్టులో దారుణం

రెండేళ్ల తర్వాత మాజీ ప్రధాని షేక్ హసీనా రీఎంట్రీ.. ఆ రోజు బంగ్లాలో అడుగు, సంకెళ్లతో రావాలన్న ప్రభుత్వం

Big Stories

Advertisement
×