Iran Threat: డొనాల్డ్ ట్రంప్ కేబినెట్ లోని సీనియర్ మినిస్టర్స్ గజ గజ వణుకుతున్నారు. ఏ క్షణంలో ఏ వైపు నుంచి ఇరాన్ ఎటాక్ చేస్తుందోనని హడలి ఛస్తున్నారు. తమ తమ ఇళ్లల్లో ఉండడం ఎంతమాత్రం సేఫ్ కాదనుకుంటోన్న మంత్రులు ఆర్మీ ప్రొటెక్షన్ ఉండే మిలటరీహౌసింగ్ ఫెసిలిటీవైపు తరలిపోతున్నారు. బతికుంటే బలుసాకు తినచ్చనుకుంటోన్న ఈ మంత్రులు ప్రస్తుతం వారు చెల్లిస్తోన్న ఇళ్ల కిరాయిని మరో 5 శాతం పెంచేసి ఇవ్వడానికి కూడా రెడీ అయిపోయారు. వీరు ఇళ్లు మారడానికి కారణం ఉంది.
ఇరాన్ పై క్షిపణులతో విరుచుకు పడ్డ అమెరికాను తాము కూడా దెబ్బతీసి తీరతామని ఇరాన్ పదే పదే హెచ్చరిస్తోంది. ఇరాన్ అమెరికాలో ప్రముఖులు, కీలక మంత్రులను టార్గెట్ చేసుకుని డర్టీ బాంబ్ పేల్చబోతోందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గలు ప్రభుత్వానికి ఉప్పందించాయట. ఆర్ధిక మంత్రి స్కాట్ బిసెంట్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ,విదేశాంగ మంత్రి మార్క్ రూబియో, అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచ్ లు సైనిక స్థావరంలోకి మారిపోయారు. తమ ఇళ్లల్లో ఉండడం ఎంతమాత్రం సేప్ కాదని వారు భయపడుతున్నారు.
ఇరాన్ ఆర్మీతో పాటు హోతీలు అమెరికాలో విధ్వంసాలు సృష్టించే ప్రమాదం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతోనే మంత్రులు వణికిపోతున్నారు. మంత్రుల ఇళ్లవద్ద సైనిక భద్రత పెంచడం కన్నా ఆ మంత్రులనే భద్రమైన మిలటరీ స్థావరాలకు తరలించడమే బెటరని ప్రభుత్వం కూడా భావిస్తోంది. అమెరికా టెక్ దిగ్గజాలైన అమెజాన్,మైక్రోసాప్ట్, స్పేసెక్స్ తదితర సంస్థలను టార్గెట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. మొత్తానికి ఇరాన్ ను భయ పెడదామనుకున్న అగ్రరాజ్యం అమెరికానే ఇరాన్ ఎప్పుడు ఏం చేస్తుందోనని భయపడి ఛస్తోంది.
Also read: నీది చీప్ క్యారెక్టర్.. క్షమాపణ చెప్పాల్సిందే..వర్షిణి, త్రిగుణ్ పై నాగ్ సీరియస్!