Earthquake In Los Angeles: అమెరికాను భారీ భూకంపం వణికించింది. కాలిఫోర్నియా, లాస్ ఏంజెలెస్ వంటి నగరాలు వణికి పోయాయి. దీని తీవ్ర రెక్టర్ స్కేలుపై 5గా నమోదు అయ్యింది. దాదాపు పుష్కరకాలం తర్వాత ఆ స్థాయిలో భూకంపం రావడంతో విమానాశ్రయాలు దెబ్బతిన్నాయి. రిఫైనరీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. భయంలో ప్రజలు బయటకు పరుగులు తీశారు. అసలు ఏం జరిగింది?
శనివారం దక్షిణ కాలిఫోర్నియా తీరంలో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5 గా నమోదు అయ్యింది. దీంతో లాస్ ఏంజిల్స్ నగరం వణికిపోయింది. ఆ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు వణికిపోయాయి. చాలా చోట్ల కిటికీలు కంపించాయి. భూకంపం ధాటికి విమానాలు సైతం ల్యాండింగ్‌ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం.. 5.0 తీవ్రతతో వచ్చిన భూకంపం.. ఉదయం 9:30 గంటలకు ఏర్పడింది. తీరప్రాంత నగరం మాన్‌హాటన్ బీచ్‌కు పశ్చిమ-నైరుతి దిశలో సుమారు 3.7 మైళ్ల దూరంలో దాదాపు 7.6 మైళ్ల లోతులో సంభవించింది. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
డజన్ల కొద్ది వచ్చిన ప్రకంపనల వల్ల లాస్ ఏంజిల్స్ నగరం వణికిపోయింది. ఒక్కసారి వణకడంతో ఇళ్లలోని బయటకు పరుగులు తీశారు. ఇళ్లు బలంగా కంపిస్తుండగా బీచ్ టౌన్‌లోని షాపుల ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. లాస్ ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పైకప్పు నుండి టైల్స్ పడి అద్దాలు పగిలిపోయాయి. పడిపోతున్న వస్తువుల నుండి తప్పించుకోవడానికి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు.
కిరాణా షాపుల పార్కింగ్ స్థలాల్లో అలారాలు మోగాయి. లాస్ ఏంజిల్స్ తీరానికి సమీపంలో సంభవించిన వరుస భూకంపాల వల్ల నష్టం జరిగిందని కానీ, ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు కనిపించడం లేదని స్థానిక అధికారులు తెలిపారు. భూకంపాలకు బాగా అలవాటుపడిన ఆ ప్రాంతం. దాదాపు పుష్కరకాలం తర్వాత అంతటి తీవ్రతతో భూకంపం వచ్చింది.
లాస్ ఏంజిల్స్‌కు సమీపంలోని మాన్‌హాటన్ బీచ్ నగర తీరానికి దూరంగా ఈ భూకంప కేంద్రం ఏర్పడినట్టు అధికారులు తెలిపారు. ఆ తర్వాత వరుసగా ప్రకంపనలు సంభవించాయని యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదించింది. భూకంపం కారణంగా కార్ల అలారాలు మోగాయి. విమానాశ్రయంలోని కిటికీలు పగిలిపోయాయి. ఎయిర్ పోర్టుకు సమీపంలోని ఓ రిఫైనరీ నుండి దట్టమైన పొగ వెలువడింది. నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు కనిపించలేదు.
❗️ PLANE TOUCHES DOWN amid SECOND MAJOR EARTHQUAKE in CALIFORNIA
LAX AIRPORT CAM shakes VIOLENTLY as 4.9 MAGNITUDE quake strikes HOURS after 5.2 https://t.co/UkfLxX3GNj pic.twitter.com/nHOOFBw4wN
— RT (@RT_com) November 28, 2026
EARTHQUAKE🚨: Air traffic controllers at Los Angeles International Airport called off the landing of a passenger airliner just moments before it touched down during Saturday’s earthquake. pic.twitter.com/ao59SOqJQQ
— For all Curious (@fascinatingonX) November 29, 2026