E-Paper
Advertisement

Chinese billionaires: సింగపూర్‌కు పయనమవుతున్న చైనా కుబేరులు

Chinese billionaires: సింగపూర్‌కు పయనమవుతున్న చైనా కుబేరులు
Advertisement

Chinese billionaires: చైనా కుబేరులు విదేశాల బాట పడుతున్నారు. వ్యాపారాల్లో కూడబెట్టిన సంపాదనంతూ మూటకట్టుకొని సింగపూర్‌కు చెక్కేస్తున్నారు. ఇప్పటికే చైనాలో ఉన్న సంపన్నుల్లో దాదాపు 10 శాతం మంది సింగపూర్‌కు మాకాం మార్చేశారు.

చైనా ప్రభుత్వం కొంతకాలంగా దిగ్గజ వ్యాపారవేత్తలు, కుబేరులు, టెక్ బిలియనీర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఆలీబాబా గ్రూప్ అధినేత జాక్‌మా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై మాట జారినందుకు అక్కడి ప్రభుత్వం అతనిపై కక్ష్య కట్టింది. దీంతో ఆయన సంపాదనంతా కోల్పోయి… చివరికి జపాన్‌లో తలదాచుకుంటున్నాడు.

Advertisement

అయితే జాక్‌మా పరిస్థితే భవిష్యత్తులో తమకెందుకు రాదని సంపన్నులు ఆందోళన చెందుతన్నారు. ఈక్రమంలో వారంతా సింగపూర్‌కు పమయనమవుతున్నారు. సింగపూర్‌లో ఆరు దశాబ్దాలుగా ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంది. అలాగే పన్నుల శాతం కూడా చాల తక్కువ. అంతేకాకుండా సింగపూర్‌లో చైనా నుంచి వలస వచ్చిన వారే ఎక్కువగా నివసిస్తుంటారు. ఈక్రమంలో సింగపూర్‌కు పమయనమవ్వడానికి చైనా కుబేరులు ఆసక్తి చూపుతున్నారు.

సింగపూర్‌కు వెళ్లడం వల్ల ఇప్పటి వరకు సంపాదించిన సొమ్మను కాపాడుకోవడంతో పాటు.. రాబోయే తరాల వారికి అందించవచ్చని సంపన్నులు భావిస్తున్నారట. అందుకే సింగపూర్‌కు వెళ్తున్న చైనా సంపన్నుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×