BigTV English

BRS: 50 స్థానాల్లో MIM పోటీ.. ఓవైసీతో వ్యూహం మార్చేసిన కేసీఆర్!!

BRS: 50 స్థానాల్లో MIM పోటీ.. ఓవైసీతో వ్యూహం మార్చేసిన కేసీఆర్!!

BRS: కేస్ 1: ఇటీవల ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ సభ నిర్వహించింది. వివిధ పార్టీల అధినేతలను, సీఎంలను పలిచింది. కానీ, ఆ సభలో తన ఆంతరంగిక మిత్రుడైన ఓవైసీ లేని లోటు కనిపించింది. ఖమ్మం మీటింగ్ కు MIMను పిలవలేదు ఎందుకు?


కేస్ 2: బీఆర్ఎస్ కోసం కేసీఆర్ ఎవరెవరినో కలుస్తున్నారు.. చాలామందితో చర్చలు జరుపుతున్నారు. కానీ, ఓవైసీతో మంతనాలు చేసినట్టు ఇప్పటివరకైతే సమాచారం లేదు. ఎందుకు?

కేస్ 3: అసెంబ్లీలో అక్బరుద్దీన్ వర్సెస్ కేటీఆర్. ఘాటుగానే సాగింది డైలాగ్ వార్. హామీలపై, సమస్యలపై, పాతబస్తీకి మెట్రో రైలుపై, ఉస్మానియా ఆసుపత్రిపై.. సర్కారును నిలదీశారు ఓవైసీ. మంత్రి కేటీఆర్ సైతం ఎక్కడా తగ్గలేదు. ఎంఐఎం నేతలు బీఏసీ సమావేశానికి ఎందుకు రాలేదు? అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్‌ సబ్జెక్ట్‌ తెలియకుండా మాట్లాడుతున్నారని.. ఆవేశంతో మాట్లాడితే సమస్యలు పరిష్కారం కావని కౌంటర్‌ ఇచ్చారు. కేవలం ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి సభలో ఇంత సమయం మాట్లాడనిస్తారా? అని మండిపడ్డారు.


కేస్ 4: కేటీఆర్ వ్యాఖ్యలకు బాగా హర్ట్ అయ్యారు అక్బరుద్దీన్ ఓవైసీ. కేటీఆర్ కామెంట్లు తమను కించపరిచేలా ఉన్నాయని భావించినట్టు ఉన్నారు. కేవలం 7 సీట్లు మాత్రమే అంటారా.. వచ్చే ఎన్నికల్లో 50 సీట్లలో పోటీ చేస్తామని అక్కడికక్కడే ప్రకటించేశారు. అసెంబ్లీలో కనీసం 15 మంది ఎమ్మెల్యేలు ఉండేలా ప్రయత్నిస్తామని సవాల్ చేశారు.

ఇలా, టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మారాక కేసీఆర్ జిగ్రీ దోస్త్ మజ్లిస్ పార్టీ విషయంలో స్టాండ్ మారినట్టు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ కేవలం తెలంగాణ వరకే టీఆర్ఎస్ రాజకీయం పరిమితం అయింది కాబట్టి.. ఓవైసీ స్నేహం గులాబీ పార్టీకి అవసరమైంది. ఇప్పుడు బీఆర్ఎస్ తో దేశవ్యాప్తంగా దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇలాంటి సమయంలో మజ్లిస్ లాంటి మత పార్టీతో జట్టుకట్టడం అంత మంచిది కాదనే భావనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే బీజేపీ పదే పదే ఈ విషయంలో గులాబీ పార్టీని కార్నర్ చేస్తోంది. తాలిబన్ల పార్టీతో పొత్తు అంటూ బద్నామ్ చేస్తోంది. ఇదేదో తేడా కొట్టేలా ఉందని డిసైడ్ అయిన కేసీఆర్.. కొంతకాలంగా ఓవైసీతో ఓపెన్ గా స్నేహం చేయడం మానేశారని అంటున్నారు. బీఆర్ఎస్ సభలకు ఓవైసీని పిలవకపోవడం.. సభలో AIMIM వర్సెస్ BRS అన్నట్టు సీన్ క్రియేట్ చేయడం.. ఇదంతా బీఆర్ఎస్ భవిష్యత్తు కోసమేననే వాదన వినిపిస్తోంది.

పొలిటికల్ గేమ్ మాటేమోగానీ.. అక్బరుద్దీన్ అన్నట్టుగానే 50 స్థానాల్లో AIMIM పోటీ చేస్తే.. బీఆర్ఎస్ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఎక్కువే!. మరి, అసలుకే ఎసరు వస్తే ఎలా..?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×