E-Paper
Advertisement

Zambia : జాంబియాలో కలరా కల్లోలం!

Zambia : జాంబియాలో కలరా కల్లోలం!
Advertisement

Zambia : కలరా వ్యాధితో జాంబియా బెంబేలెత్తిపోతోంది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా విజృంభించింది. ఇప్పటివరకు 351 మంది చనిపోగా.. 9 వేలు కేసులు నమోదయ్యాయి. ఆఫ్రికా దేశమైన జాంబియాను ముంచెత్తుతున్న వర్షాల కారణంగా.. అధిక జనాభా, పేదరికంతో మగ్గిపోతున్న పట్టణ ప్రాంతాల్లో కలుషిత నీటినే తాగుతుండటం పరిస్థితిని మరింత దుర్భరం చేస్తోంది.

కలుషిత నీటిని సేవించడం వల్ల గత 4 నెలల్లోనే 7004 మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. ఇప్పటివరకు పది ప్రావిన్సుల్లోని 45 జిల్లాలకు కలరా పాకింది. దీనిని అడ్డుకోవడంలో హెల్త్ వర్కర్లు సతమతవుతున్నారు. తొలిసారిగా 1977లో ఇక్కడ కలరా వ్యాపించింది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సాయం కోసం జాంబియా ప్రభుత్వం అర్థించింది.

Advertisement

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలల రీఓపెనింగ్‌ను వాయిదా వేసింది. ఈ వ్యాధి మరింత ప్రబలకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ 10 లక్షల వ్యాక్సిన్లను పంపుతోంది. లక్ష్యం అనేది లేకుండా గ్రామీణులు పట్టణాలకు వలస వస్తుండటాన్ని అధ్యక్షుడు హకైండే హిచిలేమా ఆక్షేపించారు. అదే కలరా వ్యాధి వ్యాప్తికి కారణమన్నారు.

పట్టణాల్లో కన్నా గ్రామాల్లోనే మంచినీరు, భూమి అందుబాటులో ఉంటుందని.. గ్రామాలకు తిరిగి వెళ్లిపోవాలని పిలుపునిచ్చారు. కలరా తమ దేశాలకు వ్యాపించకుండా పొరుగునే ఉన్న మొజాంబిక్, జింబాబ్వే దేశాలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాయి.

Advertisement

Tags

Related News

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

H-1B వీసాదారులకు ట్రంప్ ఝలక్.. 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ ఎత్తేసే ఛాన్స్, అందుకోసం కొత్తగా

Big Stories

Advertisement
×