E-Paper
Advertisement

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!

9,720mAh భారీ బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్.. షావోమీ కొత్త టాబ్లెట్ లీక్స్ రివీల్!
Advertisement

Xiaomi Pad 9: ఈ ఏడాది మార్చి నెలలో షావోమీ ప్యాడ్ 8 భారత్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్, 9,200mAh బ్యాటరీతో వచ్చిన ఈ టాబ్లెట్‌కి మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా Xiaomi Pad 9 మార్కెట్లోకి రానుంది. చైనాలోని 3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఈ కొత్త టాబ్లెట్ కనిపించడంతో త్వరలోనే ఇది విడుదల కానుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.

3C సర్టిఫికేషన్ ద్వారా వివరాలు లీక్:

చైనా సర్టిఫికేషన్ సైట్‌లో M656BA అనే మోడల్ నెంబర్‌తో సరికొత్త షావోమీ టాబ్లెట్ నమోదైంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇది Xiaomi Pad 9 కావచ్చు. ఈ లిస్టింగ్ ద్వారా ఈ ప్యాడ్ 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని స్పష్టమవుతోంది.

త్వరలోనే అధికారికంగా విడుదల:

Advertisement

ఈ ఏడాది చివర్లో రాబోయే కొత్త Xiaomi 18 సిరీస్ స్మార్ట్‌ఫోన్లతో పాటు ఈ Xiaomi Pad 9 కూడా చైనాలో విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సిరీస్‌లో ప్రామాణిక మోడల్‌తో పాటు మరింత మెరుగైన పనితీరు అందించేలా Xiaomi Pad 9 Pro వెర్షన్‌ను కూడా కంపెనీ తీసుకురానుంది. అయితే వీటిపై కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: రూ.6 వేలకే ఇలాంటి హోమ్ థియేటరా.. భారత్‌లోకి పోర్ట్రానిక్స్ సరికొత్త సౌండ్ సిస్టమ్!

భారీ మార్పులతో ఎంట్రీ:

Advertisement

పాత మోడల్‌తో పోలిస్తే.. కొత్త ప్యాడ్ 9లో కొన్ని కీలక మార్పులు ఉండబోతున్నాయి. ప్యాడ్ 8లో ఉన్న 9,200mAh బ్యాటరీ కంటే పెద్దదైన 9,720mAh బ్యాటరీని ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. అలాగే పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ప్రాసెసర్‌తో ఇది రానుంది.

Xiaomi Pad 8 ప్రత్యేకతలు:

రూ. 33,999 ప్రారంభ ధరతో విడుదలైన Xiaomi Pad 8లో 11.2 అంగుళాల 3.2K డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు. ఇప్పుడు రాబోతున్న Xiaomi Pad 9 అంతకంటే మెరుగైన అనుభవాన్ని అందిస్తుందని యూజర్లు ఆశిస్తున్నారు.

Also Read: అమెజాన్‌లో ప్రత్యక్షమైన గూగుల్ సీక్రెట్ డివైజ్.. ఇండియా లాంచ్ డేట్ లీక్?

Related News

హెల్దీగా తినాలని ఉందా? బెస్ట్ ఎయిర్ ఫ్రైయర్స్ ఇవే!

4K డిస్‌ప్లే, 12700mAh బ్యాటరీతో Lenovo Yoga Tab Gen 2.. ధరెంతో తెలుసా?

హైదరాబాద్‌లో TCS భారీ ఏఐ ప్రాజెక్ట్.. రూ.57,600 కోట్లతో HyperVault డేటా సెంటర్!

బడ్జెట్‌లో బెస్ట్ క్యాసియో అనలాగ్ వాచ్.. ఇలాంటి వాచ్ ఒక్కటైనా ఉండాలి

గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాపిల్ ఈవెంట్.. iPhone 18 Proతో పాటు వచ్చే కొత్త డివైజ్‌లు ఇవే!

రూ.7,490కే కెన్‌స్టార్ వాషింగ్ మెషీన్..బడ్జెట్‌ నంబర్ 1 మోడల్

రూ.1,699కే ఫైర్‌బోల్ట్ గ్లిట్జ్ స్మార్ట్‌వాచ్.. లుక్ అదిరిపోయిందిగా!

వావ్ అనిపించే ఫీచర్లతో Pixel Watch 5 Stephen Curry Edition సేల్ షురూ.. ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×