BigTV English

Volcano Eruption in Iceland : ఐస్‌లాండ్‌లో పేలిన మరో అగ్నిపర్వతం!

Volcano Eruption in Iceland : ఐస్‌లాండ్‌లో పేలిన మరో అగ్నిపర్వతం!

Volcano Eruption in Iceland : ద్వీపదేశం ఐస్‌లాండ్‌(Iceland)లో నెల రోజుల్లోపే మరో అగ్నిపర్వతం(Volcano) బద్దలైంది. గ్రిండావీక్ పట్టణానికి ఉత్తరాన ఈ విస్ఫోటం చోటుచేసుకుంది. దీంతో శనివారం రాత్రే ప్రజలను అక్కడి నుంచి తరలించారు. పట్టణంలోకి లావా ప్రవేశించకుండా మట్టి, రాళ్లతో అడ్డుగోడ కట్టారు. అయితే దానిని ఛేదించుకుని మరీ లావా పట్టణానికి సమీపానికి చేరుతున్నట్టు ఆర్‌యూవీ టెలివిజన్ వెల్లడించింది.


రక్షణ గోడలో పగుళ్ల కారణంగా లావా ప్రవహించడానికి మార్గం ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. రేక్‌యానెస్ (Reykjanes) ద్వీపకల్పంలో అగ్నిపర్వత విస్ఫోటం 2021 తర్వాత ఇది ఐదోసారి. నవంబర్‌లో వరుస భూప్రకంపనల అనంతరం ఇక్కడే ఉన్న మరో జ్వాలాముఖి ఉగ్రరూపం చూపించింది. దీంతో గ్రిండావిక్ నుంచి 4 వేల మందిని తరలించడమే కాకుండా.. 7 కిలోమీటర్ల దూరంలోని పర్యాటక కేంద్రమైన బ్లూలాగూన్ జియోథర్మల్ స్పా‌ను కూడా మూసివేశారు.

ఆరు వారాల అనంతరం వారంతా గత నెల 22‌నే తిరిగొచ్చారు. మళ్లీ ఇప్పుడు మరో అగ్నిపర్వతం పేలింది. విస్ఫోటానికి ముందే భూమి తీవ్రంగా కంపించినట్టు అధికారులు చెప్పారు. ఐస్‌లాండ్ రాజధాని రేక్‌యావిక్ (Reykjavik)కు 70 కిలోమీటర్ల దూరంలోనే గ్రిండావిక్ పట్టణం ఉంది. అతి శీతల వాతావరణం నెలకొని ఉండే దేశమైన ఐస్‌లాండ్ అగ్నిపర్వతాలకు పుట్టిల్లు. 130 వరకు అగ్నిపర్వతాలు ఇక్కడ ఉన్నాయి.


Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×