Psychological thriller: ఒక మనిషి మెదడు వేరొకరి శరీరంలోకి వెళ్ళడం సాధ్యమేనా ? మనిషి చనిపోయినా అతని జ్ఞాపకాలు, ఆలోచనలు, వ్యక్తిత్వం మరొక శరీరంలోకి బదిలీ చేయవచ్చా ? అమరత్వం సాధించాలనే మనిషి అత్యాశ ఎలాంటి వినాశనం సృష్టిస్తుంది ? అన్నది తెలియాలంటే సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘మాయవన్’ (Maayavan)ను చూడాల్సిందే. 2017లో వచ్చిన ఈ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? అసలు సినిమా కథ ఏంటి ? అన్న వివరాలను డీటైల్డ్ గా తెలుసుకుందాం పదండి.
ప్రముఖ న్యూరాలజిస్ట్ ప్రమోద్ హఠాత్తుగా మరణించడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. అతని అంత్యక్రియలకు వచ్చిన జిమ్ ట్రైనర్ ధీనా తన భార్యను అత్యంత క్రూరంగా హత్య చేస్తాడు. ఈ సంఘటనను చూసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ కుమారన్… ధీనాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఆ టైమ్ లో తీవ్ర గాయాలతో కుమారన్ తీవ్రమైన పీటీఎస్‌డీకి గురవుతాడు. అతనికి ట్రీట్మెంట్ చేయడానికి సైకియాట్రిస్ట్ ఆధిరాయ్ సీన్లోకి ఎంట్రీ ఇస్తుంది.
కొన్ని నెలల తర్వాత కోలుకుని కుమారన్ తిరిగి డ్యూటీలో చేరుతాడు. అప్పుడే ప్రముఖ నటి విష్మా దారుణంగా హత్యకు గురవుతుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న కుమారన్ ఒక వింత విషయాన్ని గమనిస్తాడు. గతంలో ధీనా ఏ విధంగానైతే క్రూరంగా ప్రవర్తించి హత్య చేశాడో, ఈ నటిని చంపిన వ్యక్తి కూడా అలాగే ప్రవర్తించాడు. ఆ తర్వాత ఆమె మేకప్ మ్యాన్ గోపి ఈ హత్య చేసినట్లు తేలుతుంది. పోలీసుల దాడిలో అతను కూడా చనిపోతాడు. ఆ తర్వాత ఒక ప్రముఖ సైంటిస్ట్ కూడా అదే పద్ధతిలో మర్డర్ అవుతాడు.
దీంతో కుమారన్‌కు అనుమానం వస్తుంది. చనిపోయిన హంతకులంతా అంతకుముందు ఎలాంటి నేర చరిత్ర లేని సాధారణ వ్యక్తులు. కానీ వాళ్ళు హత్యలు చేసే సమయంలో ఒకే రకమైన సైకోలాంటి ప్రవర్తన, ఒకే రకమైన అలవాట్లు ఉంటాయి. అంటే హంతకుల శరీరాలు వేరైనా, వారి వెనుక ఉన్న మెదడు ఒక్కటేనని కుమారన్ గ్రహిస్తాడు. కుమారన్ తన ఇన్వెస్టిగేషన్‌లో “ప్రాజెక్ట్ మాయవన్” అనే ఒక రహస్య ప్రయోగం గురించి తెలుసుకుంటాడు. చనిపోయిన సైంటిస్ట్ ప్రమోద్ బ్రతికున్నప్పుడు ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశాడు.
దీని ప్రకారం ఒక మనిషి చనిపోయే ముందు అతని మెదడులోని జ్ఞాపకాలను, ఆలోచనలను, వ్యక్తిత్వాన్ని ఒక చిప్ లేదా డిజిటల్ రూపంలోకి మార్చి భద్రపరచవచ్చు. ఆ తర్వాత ఆ మెదడును మరొక బ్రతికున్న మనిషి శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం ద్వారా, ఆ చనిపోయిన వ్యక్తి వేరే రూపంలో మళ్లీ జీవించవచ్చు. ఈ ప్రయోగం ద్వారా అమరత్వాన్ని సాధించాలనుకున్న అసలు సూత్రధారి ఆర్మీ మేజర్ సత్యన్ అని కుమారన్ కు తెలుస్తుంది. సత్యన్ తన మెదడును ఒక్కొక్కరి శరీరంలోకి మారుస్తూ, ఈ రహస్యం తెలిసిన సైంటిస్టులను వరుసగా చంపుకుంటూ వస్తుంటాడు. చివరకు సత్యన్ టార్గెట్… కుమారన్ శరీరమే అని తెలుస్తుంది. మరి ఆ తరువాత హీరో అతన్ని ఆపడానికి ఏం చేశాడు ? సత్యన్ ప్లాన్‌ను ఎలా తిప్పికొట్టాడు? ఈ వింత సైన్స్ ప్రయోగానికి ఎలా ముగింపు పలికాడు? అన్నది చూసి తెలుసుకోవలసిన కథ.
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘మాయవన్’. దీన్ని తెలుగులో ‘ప్రాజెక్ట్ జెడ్’ (Project Z) పేరుతో రిలీజ్ చేశారు. Aha ఓటీటీలో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ వెర్షన్ Amazon Prime Video, JioHotstarలలో కూడా అందుబాటులో ఉంది.
Read Also: కోమాలో ఉన్న భార్యను కాపాడుకోవడానికి కిరాక్ ప్లాన్, కానీ… ఒక్కసారి చూస్తే మర్చిపోలేరు భయ్యా