E-Paper
Advertisement

Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు

Earthquake: 24 వేలు దాటిన మరణాలు.. మూత్రం తాగి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు
Advertisement

Earthquake: టర్కీ, సిరియాలో సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈప్రమాదంలో మరణించిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు 24 వేల మంది మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతుండడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

శిథిలాలు కూలిపడి కొందరు మరణిస్తే.. మరికొందరు తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక ఆకలితో అలమటిస్తూ.. తీవ్రమైన చలితో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మృతుల సంఖ్య 30వేలకు చేరుకునే అవకాశం ఉంది.

Advertisement

ఇక శిథిలాల కింద చిక్కుకున్న అద్నాన్ మహమ్మద్ కోర్కుట్ అనే 17 ఏళ్ల యువకుడు 101 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు. ఆకలిని, దాహార్తిని తట్టుకోలేక మూత్రం తాగి ప్రాణాలను కాపాడుకున్నాని అద్నాన్ తెలిపాడు.

శిథిలాల కింద చిక్కుకున్న మరో విద్యార్థిని వాట్సాప్ రక్షించింది. ఓ అపార్ట్‌మెంట్ భవన శిథిలాల కింద చిక్కుకున్న 20 ఏళ్ల విద్యార్థి సమయ స్పూర్థితో.. వాట్పాప్‌లో తన స్నేహితులకు వీడియో సందేశంతో పాటు తాను ఉన్న లొకేషన్‌ను షేర్ చేశాడు. దీంతో స్నేహితులు సహాయక సిబ్బందికి సమాచారం అందించి… అతడిని సురక్షితంగా కాపాడారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×