Aadarsha kutumbam Release: ఇటీవల కాలంలో ఒక సినిమా విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఆ సినిమా సరిగ్గా అదే తేదీ విడుదల అవడం చాలా కష్టతరంగా మారిపోయింది. సినిమా విడుదల తేదీలను ప్రకటించిన తర్వాత తరచూ వాయిదాలు పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే విడుదల తేదీ ప్రకటించిన తర్వాత వెంకటేష్ (Venkatesh)నటిస్తున్న ఆదర్శ కుటుంబం (Aadarsha Kutumbham) సినిమా విడుదల విషయంలో ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా అక్టోబర్ రెండో తేదీ విడుదల కాబోతుందని చిత్ర నిర్మాతలు తెలిపారు.
ఈ సినిమా విడుదల తేదీ గురించి అధికారికంగా తెలియజేసినప్పటికీ ఈ సినిమా నుంచి ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో బహుశా ఈ సినిమా వాయిదా పడుతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేవిధంగా ఈ సినిమా కొత్త విడుదల తేదీకి సంబంధించిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. ఆదర్శ కుటుంబం సినిమా గురించి ఇలాంటి వార్తలు వస్తున్నప్పటికీ చిత్ర నిర్మాతలు ఎక్కడ స్పందించలేదు. అయితే తాజాగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత సూర్యదేవర నాగ వంశీ(Nagavamshi) ఆదర్శ కుటుంబం సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే నాగ వంశీ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందిస్తూ.. మీరు ప్రతిరోజు ఆదర్శ కుటుంబం సినిమా గురించి అడుగుతూనే ఉన్నారు. ఈ విషయాలను మేము వింటున్న కానీ మీకు చెప్పడం ఆలస్యమవుతుంది అందుకు క్షమించండి. నెల మొత్తం ఆదర్శ కుటుంబం సినిమా నుంచి వరుస సర్ప్రైజ్ లు ఉండబోతాయని, నెక్స్ట్ వీక్ ఈ సినిమా నుంచి టీజర్ ఉంటుందని తెలిపారు. అలాగే రెండో వారంలో ఫస్ట్ సింగిల్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. థర్డ్ వీక్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేస్తామని నాగ వంశీ ఆదర్శ కుటుంబం సినిమాకు సంబంధించి వరుస అప్డేట్స్ ఒకేసారి తెలిపారు.
We know you’ve been waiting for #AadarshaKutumbam … asking us everyday 😅 We heard you guys… Sorry for the delayy!!
Next one month is going to be full on surprises, leading up to the grand release on October 2nd ❤️🔥
Teaser early next week, first song in 2nd week and…
— Naga Vamsi (@vamsi84) September 5, 2026
ఈ సినిమాని ముందుగా అనుకున్న విధంగానే అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగానే విడుదల చేయబోతున్నట్లు నాగ వంశీ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి మార్పులు లేవని యధావిధిగా అక్టోబర్ రెండో తేదీ ఆదర్శ కుటుంబం రాబోతోంది అంటూ నాగ వంశీ క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా విడుదల గురించి వస్తున్నటువంటి వార్తలకు పూర్తిగా చెక్ పెట్టినట్టు అయింది. ఏకే 47 సినిమా అక్టోబర్ రెండో తేదీనే రాబోతుందనే విషయం తెలియడంతో వెంకటేష్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వెంకటేష్ ,శ్రీనిధి హీరో హీరోయిన్లు తెరుకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Also Read: క్లాప్ బాయ్ నుంచి పాన్ ఇండియా స్టార్..18 ఏళ్ల కెరీర్ పై నాని ఎమోషనల్ పోస్ట్!