Miss World 2026: మిస్ వరల్డ్ 2026 పోటీల్లో డొమినికన్ రిపబ్లిక్ బ్యూటీ జోహెరి మెలా డొమింగ్వెజ్ ప్రపంచ సుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది. గతేదాడి మిస్ వరల్డ్‌గా నిలిచిన థాయ్‌లాండ్ సుందరి ఒపల్ సుచాతా చువాంగ్‌స్రీ.. మెలాకు కిరీటం అలంకరించారు. ఈసారి ఇండియా తరపున పాల్గొన్న నిఖితా పొర్వాల్ టాప్ 40 వరకు చేరుకున్నారు. కాకపోతే టాప్-20లో స్థానం దక్కించుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా 111 మంది అందగత్తెలు ఈ పోటీలకు హాజరయ్యారు.
వియత్నాం వేదికగా డొమినికన్ రిపబ్లిక్ సుందరి జోహెరీ మోలా మిస్ వరల్డ్ 2026 కిరీటాన్ని గెలుచుకున్నారు. 72వ ఎడిషన్‌లో విజేతగా నిలిచిన ఆమెకు గతేడాది విజేత థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటా చువాంగ్‌శ్రీ చేతుల మీదుగా కిరీటాన్ని అందుకున్నారు. శనివారం వియత్నాంలో గ్రాండ్ ఫైనల్ జరిగింది. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరి మెలా విజేతగా నిలిచింది. మొదటి రన్నరప్‌గా స్పెయిన్ బ్యూటీ ఎలిసబెత్ రేనెస్ కాగా రెండో రన్నరప్‌గా మలేషియాకు చెందిన తానుసియా నిలిచారు.
మిస్ ఇండియా ఆర్గనైజేషన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో.. జోహెరీ మోలా సాధించిన ఘనతకు అభినందిస్తూ ఆన్‌లైన్‌లో ఒక పోస్ట్‌ను పంచుకుంది. మిస్ వరల్డ్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని రాసుకొచ్చింది. 73వ మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్న డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన @joheirry_mola కు హృదయపూర్వక అభినందనలు తెలిపింది.
టాప్-6 ఫైనలిస్టులో పీపుల్స్ ఛాయిస్ అవార్డు గెలుచుకున్నారు ఎరిట్రియాకు చెందిన స్నిట్ హబ్టియాబ్, యూరప్‌కు ప్రాతినిధ్యం వహించిన స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రేనెస్, మలేషియాకు చెందిన తానూసియా చెట్టి, వియత్నాంకు చెందిన లే గుయెన్ బావో గోక్, డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహెరీ మోలా, దక్షిణాఫ్రికాకు చెందిన రొమాండా హోంబిర్ ఉన్నారు.
ALSO READ: వివాహంలో భారీ అగ్నిప్రమాదం.. స్పాట్‌లో 22 మంది మృతి, కాంగోలో ఘటన
ఫైనల్ రౌండ్‌లో జోహెరీ తన సామాజిక సేవా కార్యక్రమం గురించి వివరించింది. బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ఆంగ్ల విద్యను అందించడమే తన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇంగ్లీస్ భాష పిల్లలకు భవిష్యత్తులో అనేక అవకాశాలు తెస్తుందన్నారు. విద్య ద్వారా పిల్లలు తమ భావాలను వ్యక్త పరచుకోవడం, తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పొందుతారని వెల్లడించింది.
?utm_source=ig_embed&ig_rid=Ar31_tpq7ChKzC7gOmZucnk