E-Paper
Advertisement

చిరు డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా..!

చిరు డైరెక్టర్ తో బాలయ్య సినిమా.. ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పక్కా..!
Advertisement

Balayya -vasista : టాలీవుడ్ నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను అనౌన్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉండగానే ఇప్పుడు మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈసారి బాలయ్య తన రూటు మార్చుకున్నట్లు తెలుస్తుంది. యాక్షన్ సినిమాలకు భిన్నంగా ఉండేలా చిరంజీవి డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తుంది. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు చిరంజీవితో విశ్వంభర తెరకెక్కిస్తున్న వశిష్ఠ.. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతుంది అని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్ మీడియా వర్గంలో టాప్ నడుస్తుంది.. ఇదే కనుక నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు పక్కా అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా గురించి పూర్తి వివరాలను ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

వశిష్ఠ – బాలయ్య సినిమా..?

నందమూరి నరసింహ బాలయ్య ప్రస్తుతం NBK111, NBK112 సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈ సినిమాలో ఇంకా సెట్స్ మీదనే ఉన్నాయి.. అయితే ఈ ఏడాదిలోపే ఈ సినిమాలను పూర్తి చేసి థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఈ రెండు సినిమాలు బాలయ్య చేతిలో ఉన్నా కూడా ఆయన మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వశిష్టతో ఆయన సినిమా చేయబోతున్నాడని ఓ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.. ఈ మూవీ గురించి అధికారిక ప్రకటన ఈరోజు ఉదయం 11 గంటలలోపు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినా కొన్ని రోజుల్లోనే సినిమా షూటింగ్ని ప్రారంభించాలన్న ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు సమాచారం. ఏది ఏమైనా కూడా బాలయ్య మాత్రం ఆ డైరెక్టర్ కి ఛాన్స్ ఇచ్చాడంటే ఇక విజువల్ వండర్ పక్క అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీ గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..

‘విశ్వంభర’ మూవీ..

Advertisement

టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ వశిష్ట నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసారా సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటుగా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది.. ప్రస్తుతం వశిష్ట మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తున్నాడు. ఆ మూవీ విజువల్ వండర్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ గురించి ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ మూవీ గ్రాఫిక్స్ పనులు పెండింగ్ ఉండటంతో విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది అని మెగా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీని త్వరగా పూర్తిచేసి వెంటనే బాలయ్యతో మూవీని పట్టా లెక్కించాలన్న ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తుంది.. మరి బాలయ్యతో వశిష్ట ఎలాంటి స్టోరీని తెరకెక్కిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది..

Advertisement

Also Read :సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్?

Related News

మారెమ్మపై రవితేజ ఫుల్ కాన్ఫిడెంట్.. సినిమా చూశాక ఏమన్నాడంటే!

విశ్వక్ సేన్ ‘లెగసీ’.. ఈసారి రాజకీయాలతో రచ్చ చేయబోతున్నాడా?

మీర్జాపూర్‌కు పిచ్చ క్రేజ్.. రెండో రోజు కలెక్షన్స్ చూస్తే షాక్

జగమే సంగీతం పై చిరు ప్రశంసలు… చాలా గర్వంగా ఉందంటూ పోస్ట్!

గన్స్.. గ్రేహౌండ్స్.. మధ్యలో శ్రీవిష్ణు.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ టీజర్ ఎలా ఉందంటే!

సుమలత క్షమాపణలు చెప్పాలి.. ఫెడరేషన్ కు శేఖర్ మాస్టర్ ఫిర్యాదు!

ఫ్యాన్స్ గెట్ రెడీ…బాలయ్య NBK 111 టైటిల్ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!

Big Stories

Advertisement
×