Husband hug to Wife: ఏదీ అతి చేయకూడదని పెద్దలు చెబుతారు.. తేడా వస్తే డ్యామేజ్ అవుతుంది. ఆ జంట విషయంలో అదే జరిగింది. భర్త తన ప్రేమతో భార్యని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత భార్య కింద పడిపోయింది. వెంటనే ఆసుపత్రికి తరలిస్తే ఏకంగా ఐదు పక్క ఎముకలు విరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చైనాలో ఓ విచిత్రమైన ఘటన బయట పడింది. భర్త లైఫ్‌లో ఏం జరిగిందో తెలీదు. ఇంట్లోకి వచ్చి ప్రేమతో భార్యని గట్టిగా గట్టిగా కౌగిలించుకున్నాడు. ఏకంగా భార్య ఐదు పక్కటెముకలు విరిగాయి. మరొకటి పగిలిపోయింది, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌కు చెందిన ఈ జంట కథ.
వాంగ్ దంపతులు ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. తనకు చలిగా ఉందని భార్య.. భర్తకు చెప్పడంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. అయితే భర్త కాస్త పట్టు బిగించడంతో టక్ మని శబ్దం వచ్చింది. ఆ తర్వాత భార్యకు పక్కన తీవ్రమైన నొప్పి మొదలైంది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే భార్యని ఆసుపత్రికి తరలించాడు. సీటీ స్కాన్ చేయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. ఏకంగా భార్య ఐదు పక్కటెముకలు విరిగినట్లు తేలింది. దీంతో షాక్ కావడం భర్త వంతైంది. నార్మల్‌గా భార్యని కౌగిలించుకున్నానని, ఈ విధంగా జరుగుతుందని తాను ఊహించలేదని కన్నీరు మున్నీరు అయ్యాడు సదరు భర్త వాంగ్. అక్టోబర్ 18న జరిగిన ఈ ఘటన జరిగింది.
దీన్ని స్థానిక మీడియా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ ఘటన వెనుక అసలు కారణం చెప్పారు వైద్యులు. ఆమెకు ఎముకల బలహీనత సమస్య ఉందని బయటపెట్టారు. భార్య కేవలం 45 నుంచి 50 కిలోలు మాత్రమే ఉంటుందని డాక్టర్‌కు వివరించారు భర్త. తరచూ రాత్రి వేళ భోజనం మానేయడం, ఎండ తగలకపోవడం వంటి కారణాలతో ఎముకలు బలహీనపడి ఉంటాయని అనుమానం వ్యక్తం చేశాడు.
ALSO READ: బంగ్లా జంటకు సౌదీలో ఉరి.. ఢాకాకు సమాచారం ఇవ్వకుండానే, అసలు ఏం జరిగింది?
ఎముకలు బలహీనంగా ఉన్నవారిని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు పక్కటెముకలపై తీవ్ర ఒత్తిడి పడి విరిగే అవకాశముందని వైద్య నిపుణుల చెబుతున్నారు. వాంగ్ భార్యని రెస్టు తీసుకోవాలని, సర్జరీ అవసరం లేదని చెప్పడంతో ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లాడు ఆమె భర్త. ప్రతి ఐదు రోజులకు ఒకసారి వైద్య పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుందని సమాచారం.
A tight hug from her husband reportedly left a woman in China with five fractured ribs. According to reports, the man lifted his wife slightly off the ground and wrapped his arms around her, but she soon doubled over in pain. A CT scan at the hospital later confirmed five rib… pic.twitter.com/cU1Sxwm0e4
— News9 (@News9Tweets) October 21, 2026