E-Paper
Advertisement

UK: అనుకోకుండా తలపై దాడి.. సగం పుర్రె తొలగింపు

UK: అనుకోకుండా తలపై దాడి.. సగం పుర్రె తొలగింపు
Advertisement

UK: ఆవేశంలో చేసే పనులు ఎన్నో అనార్థాలకు దారి తీస్తాయి. ఎంతో నష్టాన్ని కలిగిస్తాయి. ఒక్కోసారి ఇతరుల ప్రాణాల మీదకు కూడా తెస్తాయి. ఇలానే బ్రిటన్‌లో ఓ వ్యక్తి చేసిన పనికి బాధితుడి తల భాగాన్ని కొంత మేర కోల్పోవాల్సి వచ్చింది.

బ్రాండెన్ స్ట్రామ్‌బెర్గ్ అనే యువకుడు గతేడాది మేలో తన ప్రియురాలితో కలిసి లండన్‌లో షాపింగ్‌కు వెళ్లాడు. అక్కడ అనుకోకుండా ఓ వ్యక్తి స్ట్రామ్‌బెర్గ్ తలపై గట్టిగా పంచ్ ఇచ్చాడు. దీంతో అతడు కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. అతడి బ్రెయిన్‌లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. అప్పటికే స్ట్రామ్‌మెర్గ్ కోమాలోకి వెళ్లిపోయాడు.

Advertisement

ఆ తర్వాత అతడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సగం పుర్రెను తొలగించారు. ఇటీవల అతడు కోలుకొని కోమాలో నుంచి బయటకు వచ్చినప్పటికీ.. జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. ప్రియురాలు అతడి వెంటనే ఉంటూ తిరిగి మామూలు మనిషిని చేయడానికి ప్రయత్నిస్తోంది. గతంలో జరిగిన విషయాలను అన్నింటిని అతడికి వివరిస్తుంది. ఇక మరోసారి తలకు దెబ్బతగిలితే ప్రాణాలు పోయే అవకాశం ఉండడంతో బాధితుడు ఎటువెళ్లినా హెల్మెట్ పెట్టుకొని వెళ్తున్నాడు. ప్రస్తుతం బాధితుడికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

Related News

ఫ్రెంచ్ విప్లవ గడ్డపై మళ్లీ అగ్గి.. ఇది నిరసనా? అంతర్జాతీయ కుట్రా?

రష్యా డేటా సెంటర్లపై ఉక్రెయిన్ పంజా.. నిలిచిపోయిన డిజిటల్ సేవలు!

జైలు నుంచి పారిపోయి తన కవల సోదరుడి గుర్తింపుతో జీవనం.. యువతి సాయంతో పట్టుకున్న పోలీసులు

యెమెన్‌లో హూతీల క్షిపణి విధ్వంసం.. 53 మంది మృతి!

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

Big Stories

Advertisement
×