E-Paper
Advertisement

Fighter Get: కువైట్‌లో US F-15 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియోలు వైరల్

Fighter Get: కువైట్‌లో US F-15 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియోలు వైరల్
Advertisement

Fighter Get: కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్ బేస్ సమీపంలో అమెరికాకు చెందిన F-15 స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానం సాంకేతిక కారణాలతో కూలిపోయింది. క్రమం తప్పకుండా జరిగే శిక్షణలో భాగంగా గాలిలోకి ఎగిరిన ఈ విమానం, అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. విమానం భూమిని ఢీ కొనకముందే భారీ శబ్దంతో మంటలు చెలరేగడం స్థానికంగా కలకలం రేపింది.

ఈ ప్రమాద సమయంలో విమానంలో ఉన్న పైలట్లు అత్యంత చాకచక్యంగా వ్యవహరించి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. విమానం కూలిపోతుందని ముందే గ్రహించిన వారు, అందులోని ‘ఎజెక్షన్ సీట్’ వ్యవస్థ ద్వారా విమానం నుండి బయటకు దూకేశారు. పారాచూట్ల సాయంతో వారు సురక్షితంగా భూమికి చేరుకోగా, వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ టీం వారిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. పైలట్లకు స్వల్ప గాయాలయ్యాయని, ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. విమానం నిలువుగా ఆకాశం నుండి కిందికి పడిపోవడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున పొగలు కమ్మేయడం ఆ వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దృశ్యాలు చూస్తుంటే ప్రమాద తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విమానం జనావాసాలు లేని ఖాళీ ప్రదేశంలో పడటంతో తృటిలో పెద్ద ముప్పు తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: అమెరికాతో ఇక చర్చల్లేవ్, వెనక్కి తగ్గం, తాడోపేడో తేల్చేందుకు సిద్ధమైన ఇరాన్

Advertisement

అమెరికా రక్షణ శాఖ (Pentagon) ఈ ఘటనపై అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ప్రమాదానికి గల కారణాలను అన్వేషించడానికి ఒక ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఇది ఏదైనా ఉగ్రవాద చర్యనా లేక కేవలం ఇంజిన్ వైఫల్యమా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సాంకేతిక లోపమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నప్పటికీ, పూర్తి నివేదిక వచ్చాకే అసలు విషయాలు బయటపడతాయని అధికారులు తెలిపారు.

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×