E-Paper
Advertisement

Vijay – Sangeetha: విడాకుల వేళ.. కోడలి రహస్యాలు బయటపెట్టిన విజయ్ తండ్రి!

Vijay – Sangeetha: విడాకుల వేళ.. కోడలి రహస్యాలు బయటపెట్టిన విజయ్ తండ్రి!
Advertisement

Vijay – Sangeetha: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న విజయ్ (Vijay ) సంగీత (Sangeetha) దంపతుల గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. దాదాపు 28 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వైవాహిక బంధం లో కొనసాగుతూ క్యూట్ జంటగా పేరు దక్కించుకున్న ఈ జంట ఇప్పుడు విడాకుల పేరిట వార్తల్లో నిలవడంతో అభిమానులే కాదు సినీ సెలబ్రిటీలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే ఒకవైపు సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించిన విజయ్ దళపతి.. తన చివరి చిత్రం జననాయగన్ విడుదల చేసి ఇక పూర్తిగా రాజకీయాలకే తన కెరియర్ ను అంకితం చేయాలనుకున్నారు. ఇలాంటి సమయంలో ఆయన చిత్రం విడుదల కాకపోగా.. మరొకవైపు కరూర్ తొక్కి, సిబిఐ విచారణలతో ఇబ్బంది పడుతున్నారు విజయ్ దళపతి.

ముందు నుయ్యి వెనుక గొయ్యి..

అయితే ఇలాంటి సమయంలో విజయ్ భార్య సంగీత విడాకుల నోటీస్ ఇవ్వడం తమిళ సినీ, రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే బయట సమస్యలతో ఇబ్బందులు పడుతున్న విజయ్ కి .. సడన్గా సొంత భార్య షాక్ ఇవ్వడంతో ఆయన పరిస్థితి ముందు నుయ్యి .. వెనుక గొయ్యిలా మారిపోయింది. ముఖ్యంగా విజయ్ పై ఏడు అభియోగాలు మోపుతూ సంగీత తన పిటీషన్ లో పేర్కొనడంతో అటు విజయ్ కే కాదు ఆయన అభిమానులకు కూడా పూర్తిస్థాయిలో షాక్ కలిగించిందని చెప్పాలి.. ఇప్పుడు ఏప్రిల్ 20వ తేదీన విచారణకు రావాలి అని కోర్టు విజయ్ కి సమన్లు జారీ చేసినట్లు సమాచారం.

గందరగోళంలో విజయ్ పరిస్థితి..

Advertisement

అలా ఒకవైపు కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా విజయ్ తండ్రి చంద్రశేఖర్ తన కోడలు సంగీత గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. 2022లో నెల్సన్ దిలీప్ కుమార్ కి ప్రత్యక్షంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భార్య తనను చూస్తోందని విజయ్ తెలిపారు. అలాగే అసలైన విమర్శకురాలు తన భార్య అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇదే రకమైన వ్యాఖ్యలు చేయడం వైరల్ గా మారింది.

also read:Ranabali Movie: రణబాలి షూటింగ్ అప్డేట్..మరీ ఇంత ఫాస్ట్ ఏంటి గురూ!

కోడలిపై విజయ్ తండ్రి కామెంట్స్..

Advertisement

ఆయన మాట్లాడుతూ.. విజయ్ ఎవరి మాట వినకపోయినా సంగీత మాటకు, ఆమె అభిప్రాయానికి విలువ ఇస్తాడు. అలాగే నా కోడలు విజయ్ పై, విజయ్ నిర్వహించే అన్ని విషయాలపై ఎప్పుడు ఆమె నిఘా వేసి ఉంచుతుంది. సంగీత అన్ని విషయాలలో అత్యంత కచ్చితత్వంతో, పరిణతితో చేసే వ్యక్తి. నా మనవడు, మనవరాలు పరిణతితో క్రమశిక్షణతో పెరుగుతున్నారు అంటే అందుకు మొత్తం క్రెడిట్ సంగీతకే.. సంగీత ఎప్పుడూ దేనిలో కూడా రాజీపడదు. ఇష్టమైన ఆహారం తినిపించడంతోపాటు వారిని స్కూల్ కి పంపడం, ఇంట్లో పనులు చేయించడం ప్రతిదీ కూడా సంగీత స్వయంగా చూసుకుంటుంది.అంత క్రమశిక్షణతో పెంచింది అంటూ కోడలిపై చంద్రశేఖర్ ప్రశంసలు కురిపించారు. ఇకపోతే విడాకుల వేళ ఆమె విజయ్ పై ఆరోపణలు చేస్తూ విడాకులు కోరడం మరొకవైపు సంగీతకి సపోర్టుగా విజయ్ తండ్రి కామెంట్లు చేయడంతో అందరూ గందరగోళంలో పడిపోయారు. మరి ఈ పరిస్థితి ఎంత వరకు వెళ్తుందో చూడాలి. మొత్తానికైతే చంద్రశేఖర్ తన కోడలి గొప్పతనం గురించి చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Related News

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Sharmiela mandre :చడీ చప్పుడు లేకుండా పెళ్లి చేసుకున్న అల్లరి నరేష్ హీరోయిన్.. వరుడు ఎవరంటే?

38ఏళ్ల తర్వాత తండ్రి నాగబాబు రికార్డును రిపీట్ చేసిన నిహారిక!

సైలెంట్ గా నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ హీరో!

కళ్ళు లేవు.. మైమరిపించే గాత్రానికి నేషనల్ అవార్డు.. ఎవరీ సింగర్?

విజువల్ వండర్ గా రామాయణ ట్రైలర్.. అఫీషియల్ ఎప్పుడంటే?

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. వీడియో వైరల్!

వారికి అభినందనలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం!

Big Stories

Advertisement
×